Sarrainodu:సినిమా ఇండస్ట్రీ లో రాజమౌళి, వి వి వినాయక్ తర్వాత మాస్ సినిమాలని దైన రీతిలో తెరకెక్కించి ఆడియెన్స్ చేత శభాష్ అనిపించుకున్న ఒకే ఒక దర్శకుడు బోయపాటి శ్రీను…ఈయన కెరీర్ మొదట్లో చేసిన భద్ర, తులసి, సింహా లాంటి సినిమాలు ఈయనకు మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.
ఇక ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనకు మంచి ఫ్రెండ్ గా ఉన్న అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని మొదటి నుంచి ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చాడు. ఇక అందులో భాగంగానే సరైనోడు అనే సినిమా చేసి అల్లు అర్జున్ కి ఒక మంచి సక్సెస్ ని కూడా అందించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా స్టోరీ ని ముందుగా అల్లు అర్జున్ కి కాకుండా బోయపాటి వేరే హీరో కి చెప్పాడు అంటూ వార్తలు చాలానే వచ్చాయి. ఇక ఆ హీరో ఆ సినిమాని రిజెక్ట్ చేస్తే అది అల్లు అర్జున్ దగ్గరికి వచ్చిందంటూ విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆ హీరో ఎవరు అంటే యంగ్ రెబల్ స్టార్ అయిన ప్రభాస్…
అవును మీరు వింటుంది నిజమే మొదట ఈ సినిమా ప్రభాస్ తో చేయాలని బోయపాటి శ్రీను అనుకున్నాడు కానీ అదే టైమ్ లో ప్రభాస్ బాహుబలి సినిమా కి స్టిక్ అయిపోయి ఐదు సంవత్సరాలు లాక్ అయ్యి ఉండిపోవడంతో సరైనోడు సినిమాకి ప్రభాస్ తన డేట్స్ ని కేటాయించలేకపోయాడు. దానివల్ల ఐదు సంవత్సరాలు ఆగేంత ఓపిక లేని బోయపాటి శ్రీను అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి ఈ సినిమాని తెరకెక్కించాడు. లేకపోతే ఈ సినిమా ప్రభాస్ హీరోగా యువీ క్రియేషన్స్ లో తీసేవారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా, గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది… ఇక మొత్తానికైతే బోయపాటి శీను అల్లు అర్జున్ కి ఒక అదిరిపోయే హిట్ ఇచ్చాడనే చెప్పాలి.
ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ సరైనోడు సినిమాలో ప్రభాస్ ఉంటే ఆ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లను కూడా చేస్తున్నారు…నిజానికి బోయపాటి ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తే సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే బోయపాటి ఎలివేషన్స్ ఇస్తు సినిమాలు తీయడంలో తోపు డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి అలాంటి ఎలివేషన్ సీన్స్ ప్రభాస్ కి పడితే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అంటే చాలామంది ఇప్పటికి వీళ్ళ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఫ్యూచర్ లో అయిన ఈ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి…