Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా భారీ విజయాలను సాధిస్తూ అతనితో పాటు సినిమా యూనిట్ మొత్తానికి మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులను కూడా ఎంకరేజ్ చేశాడు కొత్త దర్శకులకు కూడా అవకాశాలను ఇస్తూ వచ్చాడు.
నిజానికి ఆయనకు హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ లేకపోయిన కూడా వాళ్ళ అన్నయ్య చిరంజీవి చేయడం వల్లే తను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక హీరోగా ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత వెనక్కి తగ్గకూడదు అనే ఉద్దేశ్యంతోనే స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేసి పవర్ స్టార్ గా ఇమేజ్ ని సంపాదించుకున్నాడు.
ఇంకా ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ కి ప్రపంచవ్యాప్తంగా చాలామంది దర్శకులు అంటే ఇష్టం ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం ఆయనకి నచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు అని తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా చిరంజీవి సినిమాలు చూస్తూ పెరుగుతూ వచ్చాడు. కాబట్టి చిరంజీవి తో మాస్ సినిమాలు చేస్తూ అలాగే ఒక జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి గొప్ప సినిమాలు చేసి మెప్పించాడు అలాగే తెలుగులో అప్పటివరకు అంత కమర్షియల్ సినిమాలు ఎవరు చేయకపోవడం రాఘవేంద్ర రావు గారు అలాంటి సినిమాలు చేసి మెప్పించి సినిమా ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఆయనంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం అంటూ అప్పట్లో ఈ విషయం మీద చాలా వార్తలు వచ్చాయి.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో ఓ.జి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఏపి ఎలక్షన్స్ అనంతరం ఈ రెండు సినిమాల షూటింగ్ లను తొందరగా కంప్లీట్ చేసి వేరే సినిమాల మీద ఫోకస్ పెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ రెండు సినిమాలతో పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా ఏంటో చూపించడానికి రెఢీ అవుతున్నాడు…