https://oktelugu.com/

Mohan Babu: ఆ స్టార్ హీరోయిన్ ని మోహన్ బాబు ఎందుకు కొట్టాడో తెలుసా..?

మోహన్ బాబు కాంపౌండ్ లో సినిమా చేయాలంటే ఇప్పటికీ కూడా చాలామంది నటులు భయపడుతూ ఉంటారు. ఇక ఇప్పటికీ అదే వైఖరి ఉంది ఇక రీసెంట్ గా భక్తకన్నప్ప సినిమాలో హీరోయిన్ గా ఒక నటిని తీసుకున్నప్పటికీ ఆ తరువాత ఆమె సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Written By:
  • Gopi
  • , Updated On : January 21, 2024 / 03:36 PM IST

    Mohan Babu

    Follow us on

    Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి హీరోగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు. తన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న మోహన్ బాబు ఏ పాత్రలో అయిన సరే నటించి మెప్పించగలిగే సత్తా ఉన్నటువంటి నటుడు కావడం విశేషం…ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కామెడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

    ఇక తన నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతని పెద్ద కొడుకు అయిన విష్ణు ని హీరోగా పరిచయం చేస్తూ విష్ణు అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ అయిన సాక్షి శివానంద్ చెల్లి అయిన శిల్ప శివానంద్ నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో మోహన్ బాబు హీరోయిన్ తో కొద్దిగా గొడవ పడినట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకానొక సందర్భంలో సెట్లో ఆమె యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే మోహన్ బాబు ఆమెని కొట్టినట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలీదు గానీ ఈ విషయం మీద అప్పట్లో వార్తలు మాత్రం విపరీతంగా వచ్చాయి అలాగే వైరల్ గా మారాయి.

    ఇక ఇలాంటి సమయంలో మోహన్ బాబు కాంపౌండ్ లో సినిమా చేయాలంటే ఇప్పటికీ కూడా చాలామంది నటులు భయపడుతూ ఉంటారు. ఇక ఇప్పటికీ అదే వైఖరి ఉంది ఇక రీసెంట్ గా భక్తకన్నప్ప సినిమాలో హీరోయిన్ గా ఒక నటిని తీసుకున్నప్పటికీ ఆ తరువాత ఆమె సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

    ఎందుకు అనే కారణాలను పక్కన పెడితే మంచు వాళ్ళు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేశన్స్ అలా ఉంటాయని ఇండస్ట్రీలో వాళ్లతో పని చేసిన చాలా మంది చెబుతూ ఉంటారని కూడా మీడియాలో పలు కథనాలు అయితే కథలు కథలుగా వస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు కూడా మంచు ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమా చాలా ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి…