Shankar Dada MBBS: చిరు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకి దర్శకుడి ని మార్చడానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు…

మనిషికి సాధించాలి అనే తపన ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొని సాధించి చూపించగలరు అని చెప్పడానికి చిరంజీవిని ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు. ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ యంగ్ హీరోలతో పాటు పోటీ పడుతూ డాన్సులు వేస్తూ, ఫైట్లు చేస్తూ సినిమా అంటే తనకు ప్రాణంగా భావించే చిరంజీవి అందరి కంటే ముందు సెట్ లో ఉంటారు.

Written By: Gopi, Updated On : January 21, 2024 3:05 pm

Shankar Dada MBBS

Follow us on

Shankar Dada MBBS: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లకంటు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. మరి ఇలాంటి సమయంలోనే ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఒక్కడే ఇండస్ట్రీకి వచ్చి తనదైన గుర్తింపును సంపాదించుకొని స్టార్ గా సుప్రీమ్ హీరోగా ఎదిగి ఆ తర్వాత మెగాస్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు చిరంజీవి…

ఒక మనిషికి సాధించాలి అనే తపన ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొని సాధించి చూపించగలరు అని చెప్పడానికి చిరంజీవిని ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు. ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ యంగ్ హీరోలతో పాటు పోటీ పడుతూ డాన్సులు వేస్తూ, ఫైట్లు చేస్తూ సినిమా అంటే తనకు ప్రాణంగా భావించే చిరంజీవి అందరి కంటే ముందు సెట్ లో ఉంటారు.

అంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు కాబట్టే చిరంజీవి అంత సక్సెస్ ని చూడగలిగారు. ఇక ఇది ఇలా ఉంటే హిందీలో సూపర్ సక్సెస్ అయిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాని తెలుగు లో చిరంజీవి హీరోగా శంకర్ దాదా ఎంబిబిఎస్ అనే సినిమా గా తెరకెక్కించారు. నిజానికి హిందీలో ఈ సినిమాని రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేయగా సంజయ్ దత్ హీరోగా నటించాడు. ఈ సినిమా అక్కడ సూపర్ సక్సెస్ అయింది. దాంతో చిరంజీవి రీమేక్ రైట్స్ ని తీసుకుని ముందుగా ఒక డైరెక్టర్ కి అప్పజెప్పాడు. ఆయనెవరు అంటే చిరంజీవితో మాస్టర్, డాడీ లాంటి రెండు సినిమాలను తీసి చిరంజీవి కి మంచి సక్సెస్ లు ఇచ్చిన సురేష్ కృష్ణ.

ఈయన కి ఆ స్టోరీ ని అప్పజెప్పి కొన్ని మార్పులు, చేర్పులు చేసి చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా సెట్ చేయమని చెప్పినప్పటికి అవి చిరంజీవికి నచ్చలేదు. దాంతో సురేష్ కృష్ణ ని తప్పించి అప్పటికే చిరంజీవితో బావగారు బాగున్నారా లాంటి సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న జయంత్ సి పరాన్జీ ని ఈ సినిమాకి డైరెక్టర్ గా తీసుకున్నాడు. ఇక జయంత్ ఈ సినిమా లో తనదైన రీతిలో మార్పులు, చేర్పులు చేసి చిరంజీవి కి మరొక సూపర్ హిట్ ని అందించాడు. ఇలా చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకి డైరెక్టర్ ను మార్చాల్సి వచ్చింది…