https://oktelugu.com/

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పక్కన ఉన్న ఆ హీరో స్టార్ యాక్టర్ కొడుకు..ఇంతకీ ఆయన ఎవరంటే..

ఆరు నెలల గడువు తీసుకున్న సాయి ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ చేశారు. ఇప్పుడు సాయి సంపత్ నంది దర్శకత్వంలో రాబోతున్న గాంజా శంకర్ అనే సినిమాలో నటించబోతున్నారట. ఇక ఈ సినిమా ఆగిపోయిందని.. ఈ సినిమా ముందుకు సాగడం లేదంటూ కొన్ని వార్తలు వచ్చాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 14, 2024 / 02:14 PM IST

    Sai Dharam Tej

    Follow us on

    Sai Dharam Tej: మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్న హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమాలో కూడా నటించారు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. కానీ విరూపాక్ష సంపాదించిన హిట్ టాక్ ఇంకా కొనసాగుతుంది అంటారు అభిమానులు. మొత్తం మీద ఈ మెగా హీరో బ్రో సినిమా తర్వాత కొన్ని నెలల గ్యాప్ తీసుకుంటాను అన్నారు.

    ఆరు నెలల గడువు తీసుకున్న సాయి ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ చేశారు. ఇప్పుడు సాయి సంపత్ నంది దర్శకత్వంలో రాబోతున్న గాంజా శంకర్ అనే సినిమాలో నటించబోతున్నారట. ఇక ఈ సినిమా ఆగిపోయిందని.. ఈ సినిమా ముందుకు సాగడం లేదంటూ కొన్ని వార్తలు వచ్చాయి. వీటిని కొట్టిపారేస్లూ.. అవి కేవలం పుకార్లే అని.. మా సినిమా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది అంటూ సాయిధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈయన తన పేరులో దుర్గా అనే పేరును యాడ్ చేసుకుంటున్నట్టు తెలిపారు.

    సాయి దుర్గా తేజ్ అని పెట్టుకోవడానికి కారణం ఆయన తల్లి పేరు దుర్గా. అందుకే తల్లి పేరును కలుపుకున్నారట. ఈయన విజయదుర్గ ప్రొడక్షన్స్ పేరుతో సొంత బ్యానర్ ను కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో సాయితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన కూడా హీరో అని మీరు గుర్తుపట్టారా? ఈయన ఎవరో కాదు నవీన్ విజయ్ కృష్ణ. అయినా ఇష్టం నువ్వు అనే సినిమాలో కీర్తి సురేష్ తో కలిసి నటించారు. కీర్తి సురేష్ మొదటి సినిమా కూడా అదే.

    నవీన్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. నవీన్ తండ్రి కూడా మరెవరో కాదు మనందిరి తెలిసిన సీనియర్ యాక్టర్ నరేష్. తొలుత హీరోగా ప్రస్తుతం సహాయ పాత్రల్లో మెయిన్ లీడ్ పాత్రల్లో నటిస్తుంటారు నరేష్. అయితే నవీన్ కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. ఇక సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి నటించిన సత్య అనే ఒక పాటకి దర్శకత్వం వహించారు. అంటే ప్రస్తుతం ఈయన దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారన్నమాట.