SSMB 29 Main Villain: ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే దర్శకుడు ఆ సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ‘యుద్ధం మొదలెట్టాక మధ్యలో ఆపడం మంచిది కాదు’ అనే ఒక స్లోగన్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తుంటారు. రాజమౌళి లాంటి దర్శకుడు సైతం పాన్ ఇండియా నేపద్యంలో భారీ సినిమాలను చేశాడు. ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ లో స్టార్ డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక మహేష్ బాబు సైతం ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరు అనేదాని మీదనే చాలా వరకు కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో అయిన పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన ఏ మేరకు మెప్పించగలుగుతాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతోందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
రాజమౌళి సినిమాలో విలన్ పాత్ర కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా తెలుగు హీరో చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి…ఆ హీరో ఎవరంటే ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు సంపాదించుకున్న రాజశేఖర్ ను ఈ సినిమాలో విలన్ గా తీసుకున్నారట…ఆ విషయాన్ని తొందర్లోనే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారట. చూడాలి మరి ఆ పాత్రలో ఆయన ఏ మేరకు మెప్పిస్తాడు అనేది…రాజమౌళి కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఆయన చేసే సినిమాలు అంచనాలకు ఏమాత్రం తగ్గినా కూడా సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించదు.
ఇప్పటివరకు 12 సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన రాజమౌళి ఈ సినిమాతో కూడా అంతకుమించిన భారీ సక్సెస్ ను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు… రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
ఇక మొత్తానికైతే ఏ దర్శకుడు హాలీవుడ్ రేంజ్ ను టచ్ చేసే సినిమాలు చేయలేదు… రాజమౌళి మాత్రం నెక్స్ట్ లెవెల్లో తన సినిమాలను చేసి తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్తున్నాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…