Photo Story: చిన్ననాటి ఫొటోలు పెద్దయ్యాక చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఒక్కోసారి ఆ ఫొటోలో ఉంది మనమేనా? అన్న ఫీలింగ్ కలుగుతుంది. పూర్వకాలంలో కొంత మంది మాత్రమే ఫొటోలు దిగి వాటిని భద్రపరుచుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియా హవా సాగిస్తుండడంతో చాలా మంది అందులో తమ చిన్ననాటి పిక్స్ ను షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా తెలుగు లెజెండ్ హీరో చైల్డ్ పిక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారీగా మీసాలున్న తన తాత వద్ద ఉన్న ఈ హీరో సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఆయన ఎవరో కాదు. నట కిరీటీ నందమూరి తారకరామారావు. ఇప్పటి వరకు నందమూరి గారి యంగ్ ఫొటోలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. తాజాగా తన చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన చిన్నప్పుడు తాతగారి వద్ద ఉన్న ఈ ఫొటో అలరిస్తోంది. ఈ ఫొటోలో ఉన్న ఎన్టీఆర్ తాతగారిపేరు రామస్వామి చౌదరి. ఎన్టీఆర్ తండ్రి పేరు లక్ష్మయ్య, తల్లి వెంకట్రావమ్మ. వీరికి ఇద్దరు పిల్లలు వారిలో ఒకరు నందమూరి తారకరామారావు. మరొకరు నందమూరి త్రివిక్రమరావు. ఎన్టీఆర్ చిన్నప్పుడు తాతగారి దగ్గరే పెరిగాయి. అంతేకాకుండా గద్దె వెంకటసుబ్బయ్య వద్ద అక్షరాలు నేర్చుకున్నారు.
నందమూరి తారకరారావు 1923 మే 28న మద్రాసు రాజ్యంలోని నిమ్మకూరులో జన్మించారు. మొదట ఎన్టీఆర్ ను కృష్ణ అని పేరు పెట్టాలనుకున్నారు. కానీ తన మేనమామ సూచనతో రామారావు అని పేరు పెట్టారు. ఎన్టీఆర్ విద్యాభ్యాసం విజయవాడ మున్సిపల్ స్కూల్లో సాగింది. ఆ తరువాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో చదివారు. ఇక్కడ తెలుగు విభాగానికి విశ్వనాథ సత్యనారాయణ అధిపతి. రామారావును ఒకసారి ఆడవారి వేషం వేయమన్నారు. ఈ క్రమంలో ఆయన మీసాలు తీయలేదు. దీంతో ఆయనను మీసాల నాగామ్మ అని పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులోనే మేనమామ కుమార్తె అయిన బసవతారకంను పెళ్లి చేసుకున్నారు.
ఎన్టీరామారావుకు మొదటగా ‘మనదేశం’అనే సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ఆ తరువాత నటించిన ‘పల్లెటూరి పిల్ల’ ముందే రిలీజ్ అయింది. 1951లో పాతాళ బైరవి తరువాత ఎన్టీఆర్ సినీ కెరీర్ మలుపు తిరిగింది. వందల కొద్దీ సినిమాల్లో నటించిన ఆయన ఆ తరువాత 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. 1983 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి 199 స్థానాలు గెలుచుకుంది. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితం నల్లేరుపై నడకలా సాగలేదు. ఆయన ఈ రెండు రంగాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.