Bigg Boss Telugu 7 Nominations: బిగ్ బాస్ హౌస్ లో ఈసారి కంటెస్టెంట్స్ ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవడం జరిగింది. అయితే హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం ఒకరిపై ఒకరు తగ్గేదే లేదు అన్నట్టు గొడవలకు దిగుతున్నారు. మొహమాటలు, మెరమెచ్చు మాటలు అన్ని మొదటివారం తోటే పూర్తయిపోయాయి. ప్రస్తుతం అందరూ క్రమంగా ఒకరి తర్వాత ఒకరు తమ అసలు రంగులో బయట పెట్టడం మొదలు పెడుతున్నారు.
రెండవ వారం నామినేషన్ల సందర్భంగా జరుగుతున్న రచ్చ అంత ఇంతా కాదు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 13 మంది మధ్య నామినేషన్ల పోరు జరుగుతుంది. అయితే నిన్న జరిగిన నామినేషన్ లో ఒక్క ఓటు కూడా పడకుండా తప్పించుకున్న వ్యక్తి మాత్రం సింగర్ దామిని. అంశాల వారీగా గ్యాప్ ఇచ్చి మరీ పెడుతున్న ఈ నామినేషన్లు ప్రస్తుతం హౌస్ లోనే కాదు ఆడియన్స్ లో కూడా ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి.
అయితే నిన్న నామినేషన్ సందర్భంగా హీరో శివాజీ ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో తన ప్రవర్తన పై.. కురిపిస్తున్న సెటైర్లపై…విమర్శలు ఎదుర్కొన్నారు. నామినేషన్ నియమం ప్రకారం బిగ్ బాస్ ఎవరి పేరు అయితే పిలుస్తారో వారు వచ్చి ఒక బాత్ టబ్ లో నిల్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే వారిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారు ఎదురుగా ఉన్న బజార్ ని నొక్కితే పైనుంచి వాటర్ వాళ్ళ పై పడతాయి. ఫ్లష్ అవుట్ పద్ధతి ద్వారా నామినేషన్ అంటూ కొత్త తరహాలో మొదలుపెట్టిన ఈ నామినేషన్స్ లో భాగంగా శివాజీ పేరు పిలవడంతో అతను వచ్చి టబ్ లో నిలబడ్డాడు.
శివాజీను నామినేట్ చేయడం కోసం మొత్తం ఆరు మంది కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారు.ప్రియాంక, అమర్ దీప్, శోభా శెట్టి, షకీలా శివాజీని నామినేట్ చేశారు. శివాజీని నామినేట్ చేయడానికి ఎవరి రీసన్స్ వారు చెప్పినప్పటికీ అందులో మాక్సిమం కామన్ గా ఉన్న పాయింట్ అతను వీక్ కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటూ హౌస్ లో డివైడెడ్ రూల్ పాలసీ తేవడం…వారు చెప్పేది వినకుండా తన వాదనతో టాపిక్ పక్కదారి పట్టించడం. రీజన్స్ చెప్పే సమయంలో కూడా శివాజీ తన రేంజ్ కౌంటర్స్ అందరికీ ఇచ్చారు. అలాగే వాళ్లు కూడా అతనికి తగ్గ సమాధానం చెప్పారు.
నిన్నటి ఎపిసోడ్లో మొత్తానికి శివాజీ నామినేషన్ ఘట్టం ఎంతో రసవత్తరంగా జరిగింది. ముఖ్యంగా ప్రియాంక జైన్ శివాజీ మధ్య వాదన.. ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది. సామెతలు చెప్పే టౌన్ చేస్తున్నారు అని ప్రియాంక అన్నప్పుడు శివాజీ అంత లేదమ్మా అని చేయి చూపించి అన్నాడు. దానికి ఫైర్ అయిన ప్రియాంక ఇలా డిస్ట్రస్పెక్ట్ చేసే హక్కు మీకు లేదు మేము రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మీరు మాతో అలాగే ఉండండి అని వాదనకు దిగింది. అయితే శివాజీ మాత్రం ఇక్కడ నేను బిగ్ బాస్ మాట తప్ప ఎవరి మాట వినను …నేను ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను అని బిల్డప్ ఇచ్చాడు.
మొత్తానికి తన ఆటిట్యూడ్ కారణంగా మంచిగానే ఓట్లు సంపాదించి నామినేట్ అయ్యాడు శివాజీ.