Prabhas: కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమా తోనే విజయాన్ని అందుకొని హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే వర్షం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడో అప్పటినుంచి ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకొని ఇండస్ట్రీ లో వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన రాజాసాబ్, కల్కి సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ అంటే చాలామంది హీరోయిన్లకు గానీ, లేడీ అభిమానులకు గాని క్రష్ అయితే ఉంటుంది.
కానీ ప్రభాస్ కి మాత్రం ఒక హీరోయిన్ అంటే క్రష్ ఉండేదట…ఆమె ఎవరు అంటే ‘అతిలోక సుందరి’ అయిన ‘శ్రీదేవి’… ప్రభాస్ చిన్నతనంలో ఉన్నప్పుడు శ్రీదేవి సినిమాలు చూసిన ప్రతిసారి ఆయనకి తెలియని ఫీలింగ్ అయితే కలిగేదట. ఆమె సినిమాలు చూసిన ప్రతిసారి చాలా అందంగా ఉంది అని అనుకునేవాడట…ముఖ్యంగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో అయితే అచ్చం ‘దేవకన్య ‘ లా ఉందని చాలాసార్లు వాళ్ల ఫ్రెండ్స్ తో కూడా చెప్పాడట. తను హీరో అయిన తర్వాత ఆమెతో కనీసం ఒక్క సినిమాలో అయిన నటించాలి అని అనుకున్నాడట.
కానీ ప్రస్తుతం ఆమె మన మధ్యలో లేకపోవడం కొంతవరకు బాధాకరమైన విషయమనే చెప్పాలి.అప్పట్లో ప్రభాస్ కి ఆమె అంటే అమితమైన ఇష్టం ఉండేదట…ఇక తనకు సెలబ్రిటీ క్రష్ లో శ్రీదేవి ఒకరి మీద మాత్రమే క్రష్ అయితే ఉండేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు… ఇక అప్పట్లో ఉన్న హీరోయిన్లందరి సినిమాలను చూస్తూ చాలా ఎంజాయ్ చేసేవాడినని కూడా చెప్పాడు.
ముఖ్యంగా సౌందర్య, రమ్యకృష్ణ లా యాక్టింగ్ అంటే అతనికి చాలా ఇష్టమట. ఇక అందులో భాగంగానే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ అమ్మగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది…ఇక మొత్తానికైతే ప్రభాస్ పాన్ ఇండియాలో టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు. గత సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈ సంవత్సరం కూడా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…