Vikram Movie Tina: సినిమాల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శించే నటుడు కమల్ హాసన్. సినిమా సినిమాకు కొత్తదనం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన ప్రయాణం కొనసాగిస్తుంటాడు. ఇదే కోవలో ఓ ఇంద్రుడు చంద్రుడు, భారతీయుడు, విచిత్ర సహోదరులు వంటి చిత్రాలు ఆయన చేసిన మైలురాళ్లలో కొన్ని. దక్షిణాదిలోనే ప్రయోగాత్మక చిత్రాలు తీయడంలో కమల్ హాసన్ కు పోటీ ఎవరుండరనేది అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సంచలనాత్మకంగా మారింది. 1986లో తీసిన విక్రమ్ సినిమాకు కొనసాగింపుగా దీన్ని నిర్మించారు. దర్శకుడు తీసుకున్న శ్రద్ధ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది.

కథ, కథనం నడిపించే విధానంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇందులో మొత్తం డ్రగ్స్ మాఫియా చుట్టూనే కథ నడుస్తుంది. కమల్ హాసన్ నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఇదంతా దర్శకుడి ప్రతిభే. కానీ సినిమా టేకింగులో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీయడమనేది ఓ అద్భతుం. దీంతో సినిమా గురించి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. కమల్ హాసన్ సినిమాలో మంచి ప్రతిభ చూపించారని పొగడుతున్నారు. విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అభిమానులకు పండగే పండగ. చాలా కాలం తరువాత కమల్ చేసిన సినిమా కావడంతో అందరు శ్రద్ధగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో టీనా పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన మరో నటి ఎవరనేదానిపై అందరిలో చర్చ జరుగుతోంది. ఇంట్లో పనిమనిషిగా చేరి తరువాత సీక్రెట్ ఏజెంటుగా మారిన టీనా ఉత్తరాది నటి అని అనుకున్నారు. కానీ కాదు ఈమె కూడా చెన్నై వాసే. డ్యాన్స్ అసిస్టెంట్ గా పలువురు మాస్టర్ల దగ్గర పని చేస్తోంది. ప్రస్తుతం దినేష్ అనే డ్యాన్స్ మాస్టర్ దగ్గర పనిచేస్తోంది. ఈమెను చూసిన డైరెక్టర్ టీనా పాత్రకు చక్కగా సరిపోతుందని తెలిసి కాంటాక్ట్ అయ్యారు. ఆమె కూడా ఒప్పుకుంది. దీంతో సినిమాలో నటించింది.

ప్రస్తుతం ఆమెకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నీ నటన బాగుందని ప్రశంసిస్తున్నారు. టీనా పాత్రలో మెప్పించి తనకు మంచి పేరు వచ్చేలా చేసిన దర్శకుడి టాలెంట్ కు అందరు ఫిదా అవుతున్నారు. ఈమె అసలు పేరు వాసంతి. త్రిష, నయనతార, సమంత లాంటి హీరోయిన్లకు డ్యాన్స్ స్టెప్పులు వేయిస్తుంది. అదృష్టం బాగుండి సినిమాలో నటించే అవకాశం రావడంతో ఇప్పుడు పాపులర్ అయింది. మొత్తానికి విక్రమ్ సినిమా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారడం గమనార్హం.
Recommended Videos


