Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అస్సలు హీరో అవుతానని అనుకోలేదు. తను ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలో తోచక ఆత్మహత్యా ప్రయత్నం చేశాడట.. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ బాగా సిగ్గరి. ఎవరితోనూ కలిసేవాడు కాదు. అలాంటి పవన్ ఇప్పుడు పరిణతి గల రాజకీయ నాయకుడిగా.. ఒక టాలీవుడ్ కు గొప్ప పవర్ స్టార్ గా ఎదుగుతాడని ఆయనే కలలో కూడా ఊహించుకోలేదట.

పవన్ కళ్యాణ్ లో ఈ మార్పునకు కారణం ‘పుస్తకాలు ’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత అన్నయ్య చిరంజీవి ఇంట్లో ఉన్నప్పుడు డిప్రెషన్ , ఒంటరితనంతో బాధపడ్డాడు. ఆ సమయంలో అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ ధైర్యం చెప్పాడు. అప్పుడే పుస్తకాలతో పవన్ కు పరిచయం ఆయనను గొప్ప పరిణతిగల వ్యక్తిగా తీర్చిదిద్దిందట..
పవన్ జీవితంలో మూడు పెళ్లిళ్ల గురించి అందరూ చెబుతున్నారు. నిజానికి ఆయన తొలి సినిమా ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’లో హీరోయిన్ ను టచ్ చేయడానికే ఎంతో తటపటాయించాడు. అలాంటి సిగ్గరి ఇప్పుడు అన్నీ అధిగమించేసి రాటుదేలాడు. పవన్ కు తొలి పెళ్లి జరిగినా ఆయన అంతకుముందు కాలేజీలో అమ్మాయిలతో ప్రేమలో పడిన దాఖలాలు లేవు. సిగ్గరి అయిన పవన్ స్కూల్లో కాలేజీలో ప్రేమలో పడలేదు.

అయితే పవన్ తొలి వివాహం విశాఖ అమ్మాయితో జరిగింది. ఆ అమ్మాయితో సెట్ కాకపోవడంతో విడాకులు అయ్యాయి. ఆ తర్వాత బద్రి సినిమాలో కలిసి నటించిన హీరోయిన్ ‘రేణు దేశాయ్’తో రెండో వివాహమైంది. అదే పవన్ జీవితంలో తొలి ప్రేమనట.. పవన్ ప్రేమించిన తొలి అమ్మాయి రేణు దేశాయ్ యేనని.. అందుకే ఆమెతో అనుబంధం ఎక్కువ అని అంటున్నారు. ‘జానీ’ సినిమాలోనూ వీరిజోడి అందరినీ అలరించేసింది.