Vyjayanthi Movies : వైజయంతి మూవీస్ బ్యానర్ పేరును అసలు ఎవరు పెట్టారో తెలుసా.?

Vyjayanthi Movies ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ అంచెలంచెలు గా ఎదుగుతూ ఒక పెద్ద బ్యానర్ గా అవతరించడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్లలందరితో సినిమాలను చేసి మంచి గుర్తింపుని సంపాదించుకుంది...

Written By: Gopi, Updated On : June 22, 2024 9:09 pm

Vyjayanthi Movies

Follow us on

Vyjayanthi Movies : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ బ్యానర్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యానర్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద సంస్థ గానే కాకుండా ఎక్కువ సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంస్థగా కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ మంచి పేరును సంపాదించుకుంది. ఈనెల 27వ తేదీన ప్రభాస్ హీరోగా వస్తున్న ‘కల్కి ‘ సినిమాని కూడా ఈ బ్యానర్ లోనే నిర్మించడం విశేషం…

ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అయిన అశ్వినీదత్ ఈ బ్యానర్ గురించి మాట్లాడుతూ తనకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తను ఎలాగైనా సరే సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం తో వాళ్ళ నాన్నను ఒప్పించి ఇండస్ట్రీకి వచ్చారట. మొదటి ప్రయత్నం గా ‘సావరిన్ ఎంటర్ ప్రైజెస్’ అనే బ్యానర్ పైన విశ్వనాథ్ దర్శకత్వంలో ‘ఓ సీత కథ’ అనే సినిమాను తీశారు. ఇది సోసో గా ఆడింది. ఇక తను ఎలాగైనా సరే తన అభిమాన హీరో అయిన ఎన్టీఆర్ తో సినిమా చేయాలని నిశ్చయించుకొని ఒక రోజు తన ఇంటికి వెళ్లి తనకు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ ని చెప్పారట. ఇక దానితో ఆనందపడిన ఎన్టీఆర్ సినిమా తీయడానికి ఇంత చిన్న ఏజ్ లో అక్కడి నుంచి వచ్చావా అని ఆశ్చర్యపోయి చాలా బాగా మాట్లాడారట. ఇక మొత్తానికైతే అశ్వినీ దత్ అప్పుడే మీతో సినిమా చేయాలనుకుంటున్నాను సార్ అని ఎన్టీయార్ తో అన్నాడట. ఇక దాంతో నాతో సినిమా చేస్తావా అసలు నా మార్కెట్ ఏంటో తెలుసా అని అడిగాడట.

దానికి అవన్నీ నాకు తెలియదు సార్ కానీ మొత్తానికైతే నేను మీతో సినిమా చేయాలని అనుకుంటున్నాను సార్ అని చెప్పడంతో సరే తర్వాత చూద్దామని ఎన్టీఆర్ చెప్పారట. ఇలా కొద్ది రోజులు గడిచే కొద్దీ తరచు గా ఎన్టీయార్ ను కలుస్తూ ఆయనతో సినిమా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తిరుగుతున్న అశ్వినీ దత్ ఒక రోజు ఎన్టీఆర్ దగ్గరికి రాగానే బాపయ్య అనే ఒక మంచి కుర్రాడు ఉంటాడు అతన్ని వెళ్లి కలువమని అశ్వినీదత్ తో చెప్పాడట. ఇక ఆ తర్వాత కే బాపయ్య, ఎమ్మెస్ రెడ్డి గార్లను పిలిచి వాళ్లతో సినిమాలు చేయడానికి ఓకే చేయించారట. ఇక ఎన్టీఆర్ కాల్షీట్ల మీద సంతకం పెడుతూ ఈ బ్యానర్ కి ఏం పేరు పెట్టారు అని అడిగారట. దాంతో అశ్వినీ దత్ ఇంకా ఏం పెట్టలేదు. కానీ కృష్ణుడి బొమ్మ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాను సార్ అని చెప్పడంతో ఎన్టీయార్ ఆలోచించి కృష్ణుడి మెడ లో వైజయంతి మాల ఉంటుంది కదా ‘వైజయంతి మూవీస్’ అని పెడుతున్నాను అని చెప్పి ఆయన స్వహస్తాలతో ఆయనే ‘వైజయంతి మూవీస్’ అని పేరు రాశారట.

ఇక అప్పుడు స్టార్ట్ అయిన వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రస్థానం ఇప్పటివరకు కొనసాగుతూనే వస్తుంది. ఇక మొదటి ప్రయత్నంలో ఎన్టీఆర్ తో చేసిన ‘ఎదురులేని మనిషి’ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ తోనే ‘యుగ పురుషుడు’ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ అంచెలంచెలు గా ఎదుగుతూ ఒక పెద్ద బ్యానర్ గా అవతరించడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్లలందరితో సినిమాలను చేసి మంచి గుర్తింపుని సంపాదించుకుంది… ఇక ఇప్పుడు కల్కి తో మరోసారి ఆ బ్యానర్ పేరు ఇండియా వైడ్ గా వినిపించబోతుంది…