Photo Story: సినిమాల్లో హీరోయిన్ గా రాణించాలంటే ఒకప్పుడు అందంగా ఉంటే చాలు అన్నారు. అందమైన ఆడాళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ వెంటనే వారిని సినిమాల్లో నటించేలా ఒప్పించేవారు. అలా అనూహ్యంగా సినిమాల్లోకి వచ్చి స్టార్లు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించిన ఓ భామ కొన్నాళ్ల తరువాత ఆమె అందంగా తయారైంది. ఆమె అందానికి ఫిదా అయినా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కపూర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఇలా రావడమే ఆలస్యం.. అలా స్టార్ అయిపోయిందీ ముద్దుగుమ్మ. తెలుగులోనూ రెండు సినిమాల్లో నటించి దేశంలోనే సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆ సుందరి ఎవరో తెలుసుకోవాలని ఉందా?
1980 నుంచి 2000 లలోపు కృష్ణ, బాలకృష్ణ ల హవా సాగింది. వీరు నటించే సినిమాలు దాదాపు సక్సెస్ సాధించాయి. కృష్ణ నటించిన సింహాసనం ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ సాధించింది. అప్పట్లో వసూళ్లు కొల్లగొట్టడంలోనూ సింహాసనం ముందుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది సుందరి మందాకిని. మందాకిని కృష్ణ తో కలిసి సింహాసనం, బాలకృష్ణతో కలిసి భార్గవ రాముడు సినిమాలో నటించింది. ఆ తరువాత వెంకటేష్, అక్కినేని నాగేశ్వర్ రావులు కలిసి నటించిన బ్రహ్మరుద్రులు సినిమాలో ఓ పాటలో కనిపించింది.
వాస్తవానికి మందాకిని అసలు పేరు యాస్మిన్ జోసెఫ్ ఠాకూర్. రామ్ తేరి గంగా మైలి అనే హిందీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 90 దశకంలో బాలీవుడ్ ను శాసిస్తున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహింతో ప్రేమాయణం నడిపిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ ఇద్దరు కలిసి దుబాయ్ లో కనిపించడంతో ఆ వార్తలు నిజమేనని అన్నారు. ఇక మందాకిని రహస్యంగా పెళ్లి చేసుకొని ఓ బాబును కన్నట్లు సమాచారం.
కానీ అఫీషియల్ గా మాత్రం ఈమె బౌద్ద సన్యాసి, డాక్టర్ కాగ్యూర్ రనింపోచే ఠాకూర్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత మందాకిని కూడా బౌద్ద మతాన్ని స్వీకరించారు. వీరికి ఇద్దరు పిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. సినిమాలు మానుకున్న తరువాత ప్రైవేట్ ఆల్బమ్ లో కనిపించారు. అయితే రీసెంట్ గా మందాకిని ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి. అమె అప్పటికీ ఇప్పటికీ అదే అందంతో ఉండడంతో అంతా షాక్ అవుతున్నారు.