OTT Releases This Week: సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ ఇండస్ట్రీ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా సినిమాలు ఎక్కువగా చూసే అలవాటు ఉన్నవారు కొత్త సినిమా కోసం ఎదురుచూస్తారు. ఒకప్పుడు కొత్త సినిమా థియేటర్ వరకు వచ్చే వరకు తెలియలేదు. ఆ తరువాత నెల రోజుల ముందు నుంచే పోస్టర్లను అంటించి తెలియజేశారు. కానీ ఇప్పుడు సినిమా ప్రారంభం నుంచే తెలిసిపోతుంది. ఎప్పుడు, ఏ సమయంలో రిలీజ్ అవుతుందనే విషయాన్ని కూడా సినీ బృందం తెలుపుతోంది.
సినిమాలతో పాటు వెబ్ సిరీసులు కూడా ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సినిమా థియేటర్లోకి వెళ్లలేని వారు మొబైల్, ల్యాప్ టాపుల్లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రతీ వారం కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీసులను రిలీజ్ చేస్తూ వాటి సమాచారం ఇస్తున్నారు. థియేటర్లో సినిమాలు ప్రతీ శుక్రవారం రిలీజ్ అయితే ఓటీటీల్లో ప్రతీ సోమవారం సినిమాలు, వెబ్ సిరీసులు అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఈ సోమవారం ఓటీటీలో ఏ యే మూవీస్ వస్తున్నాయో చూద్దాం.
గత వారం ట్రెండీగా చెప్పుకోవచ్చు. సంచలనం సృష్టించిన కేరళ ఫైల్స్, కిసి కా భాయ్ జాన్, టీకూ వెడ్స్ షేరు, తమన్నా నటించిన జీ ఖర్దా లు ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. వీటిలో చాలా మంది కేరళ ఫైల్స్ తో పాటు తమన్న జీ ఖర్దాను వీక్షించారు. ఈ వారం కూడా కొన్ని ఆసక్తికర సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అవేంటంటే..
జూన్ 29: లస్ట్ స్టోరీస్ (నెట్ ఫ్లిక్స్)
జూన్ 29 సీయూ ఇన్ మై నైన్టీన్త్ లైఫ్ (నెట్ ఫ్లిక్స్)
జూన్ 29: వీకెండ్ ఫ్యామిలీ (డిస్నీ + హాట్ స్టార్)
జూన్ 29: ఫాస్ట్ ఎక్స్ (జీ5)
జూన్ 30: జాక్ ర్యాన్ (అమెజాన్ ప్రైమ్)
జూన్ 30: వీరన్ (అమెజాన్ ప్రైమ్)
జూన్ 30 : అఫ్వా (నెట్ ఫ్లిక్స్)
జూన్ 30 : సెలబ్రిటీ (నెట్ ఫ్లిక్స్)
జూన్ 30: ది నైట్ మేనేజర్ (డిస్నీ + హాట్ స్టార్)
జూన్ 30 :లకడ్ బగ్గా (జీ5)
జూన్ 30 బుక్ మై షో (జీ5)
జూన్ 30: అర్థమైందా వరుణ్ కుమార్ (ఆహా)
జూన్ 30: సార్జెంట్ (ఆహా)