Homeఎంటర్టైన్మెంట్Raja Mouli Sye Movie: రాజమౌళి 'సై' చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో...

Raja Mouli Sye Movie: రాజమౌళి ‘సై’ చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా??

Raja Mouli Sye Movie: మన టాలీవుడ్ లో అపజయం అనేదే ఎరుగని దర్శకుడు ఎవరున్నారు అని అడిగితె టక్కుమని మనకి గుర్తుకు వచ్చే పేరు SS రాజమౌళి..బాహుబలి మరియు #RRR సినిమాలతో ఆయన ఖ్యాతి ప్రపంచం నలుమూలల వ్యాపించింది..నేడు రాజమౌళి సినిమా ఒక్కసారి అయినా నటిస్తే బాగుండును అని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రతి ఒక్క సూపర్ స్టార్ కి కోరిక ఉంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని ఆరంభించిన ఒక వ్యక్తి నేడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే నెంబర్ 1 డైరెక్టర్ గా నిలిచాడంటే మాములు విషయం కాదు..ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక్క గుణపాఠం లాంటిది అని చెప్పొచ్చు..అయితే రాజమౌళి కెరీర్ లో ఇప్పటి వరుకు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అనే మనం అనుకుంటూ ఉన్నాము..కానీ ఒక్క సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యినప్పటికీ కూడా ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది..ఆ సినిమానే నితిన్ హీరో గా రాజమోళి దర్శకత్వం లో తెరకెక్కిన సై సినిమా.

Raja Mouli Sye Movie
Sye Movie

Also Read: Virata Parvam Real Story: విరాటపర్వం అసలు కథ ఇదే.. సాయిపల్లవి పాత్ర క్లైమాక్స్ షాకింగ్

మన తెలుగు వాళ్లకి అసలు తెలియని ఆట రగ్బీ గేమ్ ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది..జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి వంటి సెన్సషనల్ హిట్ సినిమాని తీసిన తర్వాత రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించాడు..కథ కథనం మరియు టేకింగ్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ ఎందుకో ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం రాజమౌళి గత చిత్రం సింహాద్రి రేంజ్ లో వసూళ్లను రాబట్టలేకపోయింది..ఈ సినిమా అప్పట్లో 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట..ఇది ఇలా ఉండగా ఈ సినిమాని అప్పట్లో రాజమౌళి తొలుత ఉదయ్ కిరణ్ ని హీరో గా పెట్టి తీద్దాం అనుకున్నాడట..కానీ అప్పటికే ఉదయ్ కిరణ్ వేరే సినిమాలతో బిజీ గా ఉండడం తో రాజమౌళి కి డేట్స్ కేటాయంచలేకపోయాడట..అలా ఉదయ్ కిరణ్ ఒక్క సూపర్ హిట్ సినిమాని మిస్ అయ్యాడని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త.

Do you know who is the star hero who missed Rajamouli Sye movie?
Uday Kiran

Also Read: Anushka Shetty: హీరోయిన్ అనుష్క శెట్టి సోదరుడి పై హత్యాయత్నం..భద్రత కల్పించిన పోలీసులు

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular