Nuvvu Naaku Nachav- Tarun: విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే కాదు..టాలీవుడ్ లోనే కల్ట్ క్లాసికల్ మూవీ నిలిచినా సినిమాలలో ఒకటి నువ్వు నాకు నచ్చావ్ చిత్రం..విజయ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు..2001 వ సంవత్సరం లో విడుదలైన ఈసినిమా 93 సెంటర్స్ లో 50 రోజులు, 57 సెంటర్స్ లో వంద రోజులు మరియు 3 సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకొని 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించి వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది..ఇప్పటికి ఈ సినిమా టీవీ లో వచ్చిందంటే TRP రేటింగ్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..అంతటి క్రేజ్ ఉంది ఈ సినిమాకి..ఈ సినిమా విడుదలై నేటికీ 21 సంవత్సరాలు అయినా సందర్భంగా ఈ చిత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నామ
ఈ కథని తొలుత అప్పట్లో యూత్ లో ఒక రేంజ్ క్రేజ్ ఉన్న తరుణ్ తో చేద్దామని అనుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు విజయ్ భాస్కర్..ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత స్రవంతి రవి కిషోర్ గారికి చెప్పగా ఈ సినిమాలో లవ్ స్టోరీ తో కుటుంబ అంశాలు ఎక్కువగా ఉన్నాయి..కాబట్టి ఈ కథకి తరుణ్ కంటే ఎక్కువగా వెంకటేష్ గారు బాగా సూట్ అవుతారు..ఆయన డేట్స్ ని సాధించి ఆయనతోనే ఈ సినిమా చేద్దాం అన్నారట..స్రవంతి రవి కిషోర్ గారి సూచనల మేరకు ఈ సినిమాని వెంకటేష్ గారితో చెయ్యాలనుకున్న విజయ్ భాస్కర్ గారు సురేష్ బాబు గారిని కలిసి కథ చెప్పి వెంకటేష్ డేట్స్ అడిగారట.
Also Read: Hari Hara Veeramallu: సోషల్ మీడియా లో లీకైన ‘హరి హర వీరమల్లు’ మూవీ ఇంటర్వెల్ సీన్
అయితే వెంకటేష్ డైరీ మొత్తం చెక్ చేసిన తర్వాత ఆయన డేట్స్ ఖాళి లేవు అని చెప్పడం తో తరుణ్ తోనే ఈ సినిమా చేద్దాం అనుకున్నారు..ఇంతలోపే సురేష్ బాబు ఆఫీస్ నుండి విజయ్ భాస్కర్ గారికి కాల్ వచ్చింది..వెంకటేష్ గారికి ఈ కథ వినిపించాను..ఆయన ఈ సినిమాలో నటించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు..డేట్స్ సర్దుబాటు చేస్తారు అని చెప్పడం తో అప్పుడు ఈ సినిమా వెంకటేష్ హీరో గా ప్రారంభమైంది..ఇక ఈ సినిమా లో తొలుత హీరోయిన్ గా త్రిష లేదా గజాల వంటి వారిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు..కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ చొరవ తో ఆర్తి అగర్వాల్ కి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది..అలా తరుణ్ – త్రిష కలిసి చెయ్యాల్సిన ఈ సినిమాని వెంకటేష్ – ఆర్తి అగర్వాల్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించేసారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Do you know who is the star hero who gave up the movie nuvvu naaku nachav
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com