Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 2వ రోజు: టాస్క్ లతో రెచ్చిపోయిన బిగ్ బాస్.. ఇనాయా బరెస్ట్.. రెచ్చిపోయిన లేడీ పుష్ప ‘గీతూ’
హగ్గులతో బిగ్ బాస్ 2వ రోజు ప్రారంభమైంది. హౌస్ లోని కొంత మంది హగ్గులు తీసుకోవడం లేదన్న దానిపై టాపిక్ నడిచింది. హగ్గులతోనే అనుబంధం పెరుగుతుందంటూ కంటెస్టెంట్లు కౌగిలించుకున్నారు. ఇక ఆ తర్వాత సింగర్ రేవంత్ తీరుపై ఇంటిసభ్యులు చర్చించుకున్నారు. అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని లేడీ పుష్ప గీతూ అతడి ముందే చెప్పేసింది. దీనికి బాలాదిత్య, జబర్ధస్త్ చలాకీ చంటి కూడా సమర్థించారు. రేవంత్ నోటి దురుసు వల్ల అతడికే నష్టం వాటిల్లుతుందని వాళ్లంతా హితవు పలికారు. […]

హగ్గులతో బిగ్ బాస్ 2వ రోజు ప్రారంభమైంది. హౌస్ లోని కొంత మంది హగ్గులు తీసుకోవడం లేదన్న దానిపై టాపిక్ నడిచింది. హగ్గులతోనే అనుబంధం పెరుగుతుందంటూ కంటెస్టెంట్లు కౌగిలించుకున్నారు.
ఇక ఆ తర్వాత సింగర్ రేవంత్ తీరుపై ఇంటిసభ్యులు చర్చించుకున్నారు. అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని లేడీ పుష్ప గీతూ అతడి ముందే చెప్పేసింది. దీనికి బాలాదిత్య, జబర్ధస్త్ చలాకీ చంటి కూడా సమర్థించారు. రేవంత్ నోటి దురుసు వల్ల అతడికే నష్టం వాటిల్లుతుందని వాళ్లంతా హితవు పలికారు.
ఉదయం టిఫిన్ సరిగ్గా పెట్టడం లేదని.. ఫుడ్డు లేదని సింగర్ రేవంత్ లొల్లి ఇంటిసభ్యులతో లొల్లి మొదలుపెట్టాడు. గీతూతో కాసేపు వాదించాడు. ఇక టాస్కుల్లో మార్చుకోవడానికి రేవంత్ అందరినీ వేడుకోవడం కనిపించింది. కానీ ఎవరూ రేవంత్ తో మారడానికి ఒప్పుకోలేదు.
చివరకు క్లాసు నుంచి బాలాదిత్య ట్రాష్ గ్రూపులోకి వెళగా.. ట్రాష్ నుంచి గీతూను క్లాస్ లోకి మార్చారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు.
క్లాస్ లోకి వెళ్లిన గీతూ ఇంటి సభ్యులను ఓ రేంజ్ లో ఆడుకుంది.అందరినీ పిలిచి వారితో పనులు చేయించుకుంది. చేతులు కడిగించుకుంది. నీళ్లు తెప్పించుకుంది. ఇనయాను ఓ రేంజ్ లో ఆడుకుంది. ఇనయా కూడా గీతూకు గట్టిగా సమాధానమిచ్చి దబాయించింది.
ఇక రేవంత్ ను ఎవరూ ఏమీ అనకుండా ఏం గుర్తుకు వచ్చిందో కానీ బోరున ఏడుస్తూనే ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో భారీ వర్షం రావడంతో ఒక పాట వేసి అందరినీ డ్యాన్స్ చేయించాడు.
బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. రేవంత్ తోపాటు అభినయశ్రీ కి పోటీ పెట్టాడు. ఈ గేమ్ లో రేవంత్ గెలిచారు. దీంతో అతడిని ట్రాష్ నుంచి మాస్ లోకి మార్చాడు బిగ్ బాస్.
ఇనాయా, నేహా మధ్య బిగ్ బాస్ పోటీ పెట్టగా.. నేహా గెలిచింది. తనకు ఎవరూ సహకరించడం లేదని ఇనాయా గొడవ పెట్టుకుంది. బాలాదిత్యను అడ్డం వస్తున్నాడని అనవసరంగా వాదించుకొంది. అలిగి బాత్రూం వెళ్లి ఏడ్చేసింది. గెలిచిన నేహా క్లాస్ లోకి మారిపోగా.. క్లాస్ లోని సూర్య మాస్ లోకి మారారు.
ఓడిపోయిన ఇనాయా.. యూట్యూబర్ అయిన ఆదిరెడ్డితో గొడవ పెట్టుకుంది. తనతో దురుసుగా మాట్లాడాడని ఆదిని విమర్శించింది. దీనిపై హౌస్ లోని ఇంటి సభ్యులంతా ఇనయాను తప్పుపట్టారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది.
టాస్క్ పూర్తయ్యే సమయానికి నేహా, ఆదిరెడ్డి, గీతూ క్లాస్ టీంలో ఉన్న కారణంగా వీరు నామినేషన్స్ నుంచి సురక్షితులు అయ్యారు. ఆదిత్య, అభినయశ్రీ, ఇనాయా ట్రాష్ టీంలో ఉన్న కారణంగా వీరు నేరుగా నామినేట్ అయ్యారు.
రెండో రోజు బిగ్ బాస్ ఓవరాల్ గా చూస్తే గేమ్స్ తో కంటెస్టెంట్స్ మధ్య పోటాపోటీ వాతావరణాన్ని బిగ్ బాస్ సృష్టించాడు. కొందరిలోని ఎమోషన్స్ ను తట్టి లేపారు. కొందరినీ రెచ్చగొట్టి కంటెంట్ రాబట్టాడు. మరికొందరినీ ఇన్ వాల్వ్ అయ్యేలా చేశాడు.
