https://oktelugu.com/

Custody Arvind Swamy Character: ‘కస్టడీ’ లో అరవింద్ స్వామి క్యారక్టర్ ని వదులుకున్న స్టార్ హీరో అతనేనా..!

ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి కేవలం నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే రాబట్టింది. అంటే షేర్ కనీసం రెండు కోట్ల రూపాయిలు కూడా వచ్చి ఉండదు. నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఓపెనింగ్ ఇది అని చెప్పొచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : May 13, 2023 / 02:03 PM IST

    Custody Arvind Swamy Character

    Follow us on

    Custody Arvind Swamy Character: అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ముందు నుండి సరైన అంచనాలు లేకపోవడం కారణం గా డిజాస్టర్ టాక్ లేకపోయినా కూడా కలెక్షన్స్ డిజాస్టర్ రేంజ్ లోనే వచ్చాయి. రీసెంట్ గా విడుదలై పెద్ద ఫ్లాప్స్ గా మిగిలిన ‘శాకుంతలం’ మరియు ‘ఏజెంట్’ చిత్రాల రేంజ్ లో కూడా ఈ సినిమా వసూళ్లను రాబట్టలేకపోయింది.

    ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి కేవలం నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే రాబట్టింది. అంటే షేర్ కనీసం రెండు కోట్ల రూపాయిలు కూడా వచ్చి ఉండదు. నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఓపెనింగ్ ఇది అని చెప్పొచ్చు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరిగింది. ఫుల్ రన్ లో ఎంత నష్టాలను మిగల్చబోతుందో అని భయపడుతున్నారు బయ్యర్స్.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమా అరవింద స్వామి క్యారక్టర్ హైలైట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఈయన క్యారక్టర్ వల్లే సినిమాకి కాస్త డివైడ్ టాక్ అయినా వచ్చింది, లేకుంటే డిజాస్టర్ టాక్ వచ్చేదని చెప్తున్నారు విశ్లేషకులు. అయితే ఈ పాత్ర కోసం తొలుత అరవింద్ స్వామి ని కాకుండా తమిళ హీరో మాధవన్ ని అడిగారట.

    మాధవన్ చెయ్యడానికి సుముఖంగానే ఉన్నప్పటికీ డేట్స్ సర్దుబాటు చెయ్యలేక ఈ చిత్రాన్ని వదులుకున్నాడట. మాధవన్ గతం లో నాగ చైతన్య తో కలిసి సవ్యసాచి అనే చిత్రం లో నటించాడు.ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది.ఆ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ మిస్ అయ్యింది. ‘మానాడు’ వంటి సూపర్ హిట్ తర్వాత వెంకట్ ప్రభు కి ఇంత పెద్ద ఫ్లాప్ వస్తుందని ఫ్యాన్స్ ఊహించలేకపోయారు.