Number One Heroine: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న మన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ సాధించడంతో మన హీరోలకి అక్కడ ఎక్కువ హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఇక హీరోలతో పాటుగా ఒక హీరోయిన్ కి కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ గుర్తింపైతే వచ్చింది…ఒక సంవత్సర వ్యవధిలోనే ఆమె రెండు భారీ సక్సెస్ లను సాధించిన సినిమాల్లో నటించడం అనేది మామూలు విషయం కాదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే నేషనల్ క్రష్ అయిన రష్మిక మందాన…మొదట ‘పుష్ప ‘ సినిమాతో 450 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘అనిమల్ ‘ సినిమా 900 కోట్ల కలెక్షన్లను రాబట్టింది… ఇక ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో దాదాపు 1500 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక మొత్తానికైతే ఈ మూడు సినిమాల్లో హీరోయిన్ గా తను కీలకపాత్ర వహించింది. కాబట్టి ప్రస్తుతం ఈమె ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
అందుకే ఇప్పుడు ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి చాలామంది దర్శక నిర్మాతలు సైతం పోటీ పడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక పుష్ప 2 సినిమాలో ఆమె క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది… పుష్ప గురించి హైపిస్తూ ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకుల్లో కంటతడి పెట్టించడమే కాకుండా యావత్ సినిమా మొత్తానికి ఒక హై బూస్టప్ ను ఇచ్చిందనే చెప్పాలి…
మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఫ్యూచర్ లో మరింత ముందుకు ఎదగాలనే ప్రయత్నం చేస్తుంది. ఒక్క సినిమా కోసం దాదాపు 1200 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడుకి మార్కెట్ ఉంది. కాబట్టి అంత రెమ్యూనరేషన్ చార్జ్ చేయడంలో తప్పేమీ లేదు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం విశేషం…
ఇక ఏది ఏమైనా పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని మెప్పించడమే కాకుండా ఏ హీరో పక్కన యాక్టింగ్ చేసిన కూడా ఆమె ఆ హీరో తో మంచి కెమిస్ట్రీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతుంది. కాబట్టి ఈవిడకి చాలా మంచి గుర్తింపైతే ఉందనే చెప్పాలి…