https://oktelugu.com/

Tollywood Heroes: హాలీవుడ్ హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న తెలుగు హీరోలు వీళ్లేనా..?

తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. బాలీవుడ్ హీరోలు సైతం మన తెలుగు సినిమాల ప్రవాహాన్ని ఆపలేకపోయారు. ఇక వాళ్లు ఇన్ఫియార్టీ కాంప్లెక్స్ లో పడి ఎలాంటి సినిమాలు తీస్తే జనాలకు నచ్చుతుందో తెలియక ఒకవేళ భారీ సినిమాలు తీసిన ఆ సినిమాలు సరిగ్గా ఆడకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందు మన పరువు పోతుందేమోనని ఉద్దేశ్యంతో సినిమాలు చేయకుండా ఖాళీగానే ఉంటున్నారు తప్ప భారీ సినిమాలైతే చేయడం లేదు. ఇక ముఖ్యంగా అమీర్ ఖాన్ లాంటి హీరో ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉంటున్నాడు అంటే ఆయన ఎలాంటి డిప్రెషన్ లో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు...

Written By:
  • Gopi
  • , Updated On : December 22, 2024 / 02:20 PM IST

    Tollywood Star Heroes

    Follow us on

    Tollywood Heroes: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. అందుకోసమే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ రెమ్యూనరేషన్ ని తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్లలో మన తెలుగు హీరోలే ఉండటం విశేషం…ప్రస్తుతం ప్రభాస్ లాంటి స్టార్ హీరో సైతం 200 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సైతం పుష్ప 2 సినిమా కోసం 300 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకున్నారంటూ ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి అంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయిలో అల్లు అర్జున్ తన స్టార్ డమ్ ను విస్తరించుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. అలాగే తనకున్న క్రేజ్ ను బట్టి ప్రొడ్యూసర్స్ కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న మన స్టార్ హీరోలు వరుస సక్సెస్ లను సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ఇదిలా ఉంటే దాదాపు మన స్టార్ హీరోలు హాలీవుడ్ హీరోలతో సైతం పోటీ పడుతూ రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నారు అంటూ రీసెంట్ గా కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

    నిజానికి హాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు లాభాల్లో పర్సంటేజ్ తీసుకుంటారు. వాళ్ళు కనక రెమ్యూనరేషన్ తీసుకుంటే మన హీరోలతో సమానంగానే ఉంటుంది తప్ప అంతకంటే పెద్దగా ఎక్కువగా ఏమీ ఉండదని వాళ్లు వల్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అంటే హాలీవుడ్ ఇండస్ట్రీ తో పోల్చుకుంటే మన ఇండస్ట్రీ చాలా చిన్నది.

    వాళ్ళు సినిమాలు అన్నీ దేశాల్లో కూడా భారీ రేంజ్ లో కలెక్షన్స్ ను వసూలు చేస్తు ఉంటాయి. అలాంటి వారే అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటే మన వాళ్ళు మాత్రం ఇంత ఎక్కువ రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకుంటున్నారనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక రెమ్యూనరేషన్ విషయంలోనే కాదు కంటెంట్ విషయంలో గాని, ఎఫర్ట్స్ విషయంలో గానీ మనవాళ్ళు కూడా హాలీవుడ్ హీరోల మాదిరిగానే భారీ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది….