Highest Fan Base Hero: ఒక సామాన్యమైన నటుడిని స్టార్ ని చేసేది ప్రేక్షకులే. ఎవరైతే తమ నటనతో అభిమానులను సంపాదిస్తారో వారు స్టార్ అవుతారు. ఒక హీరో ఫ్యాన్ బేస్ ఆధారంగా అతడి స్థాయి నిర్ణయించబడుతుంది. చిన్న హీరో, టైర్ టు హీరో, స్టార్ హీరో అనే స్థాయిలు అభిమానుల ఆధారంగానే డిసైడ్ అవుతాయి. ఈ మధ్య పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చింది. ఒక హీరో సినిమా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో, పరిశ్రమల్లో కూడా హీరోలకు అభిమానులు ఏర్పడుతున్నారు.
అభిమానం ఎల్లలు దాటిపోతుంది. రజినీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్ లకు జపాన్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉండగా… అసలు దేశంలో అత్యధిక అభిమానులు కలిగిన హీరో ఎవరని ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఆ సంస్థ సర్వే ప్రకారం కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరో అట.
రజినీకాంత్, ప్రభాస్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బడా స్టార్స్ ని వెనక్కి నెట్టి విజయ్ నెంబర్ వన్ పొజిషన్ కైవసం చేసుకున్నాడు. నిజానికి విజయ్ ఒక్క పాన్ ఇండియా చిత్రం కూడా చేయలేదు. అయినప్పటికీ ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని ఈ సర్వే తేల్చింది. గత ఐదేళ్ల వరకు విజయ్ ఇమేజ్ కోలీవుడ్ కే పరిమితం. వరుస విజయాలతో విజయ్ ఇతర భాషల్లో సైతం అభిమానులను సొంతం చేసుకున్నారు.
కాగా విజయ్ రాజకీయ పార్టీ పెట్టారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఈ మేరకు సన్నద్ధం అవుతున్నారు. దర్శకుడు హెచ్ వినోద్ తో తన చివరి చిత్రం చేస్తున్న విజయ్.. అనంతరం పూర్తిగా సినిమాలకు దూరం కానున్నాడు. విజయ్ తర్వాత అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోగా ప్రభాస్ నిలిచాడు.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ఆయన గత చిత్రం కల్కి 2898 AD రూ. 1000 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ప్రభాస్ కి అభిమానులు ఉన్నారు. ఇక మూడో స్థానం షారుఖ్ ఖాన్ కి దక్కింది. దశాబ్దానికి పైగా విజయాలు లేక ఇబ్బంది పడిన షారుఖ్ ఖాన్ గత ఏడాది ఫార్మ్ లోకి వచ్చాడు. పఠాన్, జవాన్ చిత్రాలతో భారీ విజయాలు నమోదు చేశాడు. ఆయన మూడో స్థానంలో ఉన్నారు.