Devara: దేవర విషయంలో ఎన్టీఆర్ కి అన్నయ్య కళ్యాణ్ రామ్ దూరం… నందమూరి బ్రదర్స్ మధ్య ఏం జరుగుతోంది?

తమ్ముడు ఎన్టీఆర్ తో దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు కళ్యాణ్ రామ్. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ అసలు కనిపించలేదు. ఆయన దేవర చిత్రానికి దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో నందమూరి బ్రదర్స్ మధ్య ఏం జరుగుతుందనే వాదన మొదలైంది.

Written By: S Reddy, Updated On : September 28, 2024 9:10 am

Devara(7)

Follow us on

Devara: హరికృష్ణ కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ అతిపెద్ద స్టార్ గా ఎదిగాడు. కళ్యాణ్ రామ్ మాత్రం నటుడిగా నిలదొక్కుకోవడంలో స్ట్రగుల్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మాత కూడాను. ఆయన హీరోగా నటించిన పలు చిత్రాలను స్వయంగా నిర్మించారు. ఎన్టీఆర్ తో జై లవ కుశ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత దేవర చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించారు.

యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మించాయి. దేవర బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్లు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో అత్యధిక బడ్జెట్ మూవీ ఇది. కళ్యాణ్ రామ్ కి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఆయన బ్యానర్ లో నిర్మిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం. అయితే దేవర మూవీ ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ కనిపించలేదు. కళ్యాణ్ రామ్ ఎందుకో దేవర మూవీని పట్టించుకోలేదనే భావన కలిగింది.

దేవర కోసం సంబంధం లేని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. సందీప్ రెడ్డి వంగ, అలియా భట్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వంటి స్టార్స్ దేవర ప్రమోషన్స్ లో భాగమయ్యారు. ఎన్టీఆర్ దేవర కోసం చాలా కష్టపడ్డారు. ఆయన పలు నగరాల్లో సంచరించారు. చెన్నై, బెంగుళూరు, ముంబై నగరాల్లో ఏర్పాటు చేసిన, ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఆ సీరియస్ నెస్ కళ్యాణ్ రామ్ లో కనిపించలేదు. కోట్లు కుమ్మరించి తెరకెక్కించిన చిత్రాన్ని కళ్యాణ్ రామ్ ఎందుకు నిర్లక్ష్యం చేశాడు? ప్రమోషన్స్ లో ఎందుకు కనిపించలేదనే సందేహం మొదలైంది.

ఈ క్రమంలో ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చాయా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ అపోహలు మాత్రమే అని తెలుస్తుంది. తన లేటెస్ట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ ప్రమోషన్స్ లో పాల్గొనలేదట. ఆ బాధ్యత ఎన్టీఆర్ కి అప్పగించాడట. నిన్న దేవర విడుదల కాగా.. మీడియా ముందుకు కళ్యాణ్ రామ్, దిల్ రాజు, కొరటాల శివ వచ్చిన సంగతి తెలిసిందే.

దేవర చిత్రానికి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తమ్ముడు ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. అలాంటి తమ్ముడు తనకు ఉండటం అదృష్టం అన్నారు. కళ్యాణ్ రామ్ ప్రెస్ మీట్ తో సందేహాలు పటాపంచలు అయ్యాయి. మరోవైపు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న దేవర కలెక్షన్స్ పరంగా రికార్డులు నెలకొల్పుతుంది. ఫస్ట్ డే దేవర వరల్డ్ వైడ్ రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.