https://oktelugu.com/

Athadu: ‘అతడు’ సినిమాలో సోనూసుద్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

‘అతడు’ సినిమాలో సోనూసుద్ పాత్ర ఆకట్టుకుంటోంది. ఇందులో అతడు విలన్ అయినా తనదైన శైలిలో నటించారు. ఆ తరువాత సోనూసుద్ కు విలన్ గా గుర్తింపు తెచ్చుకొని స్టార్ అయ్యాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 20, 2023 / 12:25 PM IST

    Athadu

    Follow us on

    Athadu: త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా అంటే అదిరిపోతుంది అంటారు మహేష్ ఫ్యాన్స్.. ఇప్పటి వరకు వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సక్సెస్ కావడంతో లేటేస్టుగా ‘గుంటూరు కారం’ రూపుదిద్దుకుంటోంది. మాటల రచయితగా ఇండస్ట్రీకి వచ్చిన త్రివిక్రమ్ ‘అతడు’ సినిమాతో డైరెక్టర్ గా మారిపోయాడు. అప్పటి వరకు వరుస ప్లాప్ లు ఎదుర్కొంటున్న మహేష్ బాబుకు ఈ సినిమాతో మరోసారి కెరీర్ టర్న్ అయింది. ఇందులో మహేష్ బాబుతో పాటు త్రిష, ప్రకాశ్ రాజ్, సునీల్ తదితరులు నటించి వారి పాత్రల్లో మెప్పించారు. ఇందులో మహేష్ కు సమానంగా నటించిన మరో వ్యక్తి సోనూసుద్. అయితే సోనూసుద్ పాత్రలో ఓ స్టార్ హీరో నటించాల్సి ఉండేదట. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన మిస్ చేసుకున్నాడట. మరి ఆ స్టార్ హీరో ఎవరంటే?

    ‘అతడు’ సినిమాలో సోనూసుద్ పాత్ర ఆకట్టుకుంటోంది. ఇందులో అతడు విలన్ అయినా తనదైన శైలిలో నటించారు. ఆ తరువాత సోనూసుద్ కు విలన్ గా గుర్తింపు తెచ్చుకొని స్టార్ అయ్యాడు. కరోనా కాలంలో ఎంతో మందికి సేవ చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. సినిమాల్లో విలనిజంతో మెప్పించిన ఆయన రియల్ గా కనిపిస్తే పాలాభిషేకం చేస్తున్నారు. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సోనూసుద్ కు ‘అతడు’ మైలురాయి అని చెప్పొచ్చు.

    Athadu

    సోనూసుద్ పాత్ర ను తాను చేయాల్సి ఉండేది.. కానీ మిస్ చేసుకున్నానని ఓ స్టార్ హీరో చెప్పాడు. ఆయన ఎవరో కాదు.. వేణు తొట్టెంపూడి. ఫ్యామిలీ హీరోగా, కామెడీ సినిమాల్లో నటించిన వేణు స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ తో మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను ‘అతడు’ సినిమాలో సోనూసుద్ పాత్రను చేయాల్సి ఉండేదని, కానీ కొన్ని కారణాల వల్ల మిస్ చేసుకున్నానని చెప్పాడు. ఆ పాత్ర చేసి ఉండే తన స్టార్ ఇమేజ్ వేరే లెవల్లో ఉండేదన్నారు.

    వేణు తొట్టెంపూడి ప్రస్తుతం ‘అతిథి’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇందులో ఆయన యాక్షన్ హీరోగా కనిపించనున్నాడు. కొన్నాళ్లపాటు అమెరికాలో వ్యాపారంలో మునిగిన ఆయన మళ్లీ వెబ్ సీరీస్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే సినిమాల కోసం పెద్దగా రిస్క్ తీసుకోనని, మంచి కథ వస్తే సినిమాల్లో నటిస్తానని వేణు చెబుతున్నాడు.