https://oktelugu.com/

Bollywood Star Hero: ఓటిటిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

కరోనా కి ముందు వరకు ఓటిటి లు పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ కరోనా సమయం లో లాక్ డౌన్ వల్ల అందరు ఓటిటి లో సీరీస్ లు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపించారు. దాంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది.

Written By:
  • Gopi
  • , Updated On : May 10, 2024 / 03:34 PM IST

    ajay devgn getting the highest remuneration in OTT

    Follow us on

    Bollywood Star Hero: ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక అందులో భాగంగానే ప్రముఖ ఓటిటి సంస్థలు భారీ ధరకు వెబ్ సిరీస్ లను కొనుగోలు చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో ముందు వరుస లో ఉంటున్నాయి. ఇక కరోనా కి ముందు వరకు ఓటిటి లు పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ కరోనా సమయం లో లాక్ డౌన్ వల్ల అందరు ఓటిటి లో సీరీస్ లు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపించారు. దాంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది.

    ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి వెబ్ సిరీస్ చేస్తూ భారీగా సంపాదిస్తున్న నటీనటులు కూడా ఉన్నారు. ఇక అందులో భాగంగానే బాలీవుడ్ కి చెందిన అజయ్ దేవగన్ ఓటిటిలో వెబ్ సిరీస్ చేయడం కోసం ఒక్క ఎపిసోడ్ కి దాదాపు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అంటే 10 ఎపిసోడ్లు ఉంటే 200 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నాడు. నిజానికి అజయ్ దేవగన్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

    ఇక సినిమాల్లో కూడా ఆయన భారీ పారితోషికం తీసుకుంటాడు. ఇక దాంతో పాటుగా వెబ్ సిరీస్ లో కూడా ఆయనని వాడుతూ ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి అతని చేత నటింపజేస్తున్నారు. అయినప్పటికీ ఆయన చేసిన సిరీస్ కి కూడా మంచి ఆదరణ లభించడంతో రోజురోజుకీ ఆయన డిమాండ్ అయితే భారీగా పెరుగుతుంది. ఇప్పుడు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న రుద్ర సిరీస్ కోసం ఆయన ఒక ఎపిసోడ్ కి దాదాపు 20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇక మొత్తం 7 ఎపిసోడ్స్ గా వస్తున్న ఈ రుద్ర సిరీస్ దాదాపు 140 కోట్ల వరకు రెమ్యూన రేషన్ తీసుకున్నాడు.

    ఇక అందులో భాగంగానే ఆయన అటు సినిమాలు చేస్తూనే, ఇటు సిరీస్ ల్లో కూడా భారీగా సంపాదిస్తున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా కొడైకొస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన మరి కొన్ని సిరీస్ లకు కూడా సైన్ చేశాడు. ఇక ఇప్పుడు దాంతో పాటుగా రోహిత్ శెట్టి డైరెక్షన్ లో సింగం ఎగైన్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ సినిమా తొందర్లోనే థియేటర్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది…