https://oktelugu.com/

Samantha: సమంతకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఇది ఎవరూ ఊహించరు

హీరోయిన్ సమంతకు ఓ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట. గ్యాప్ దొరికితే ఆయన గురించే మాట్లాడుతుందట. సమంత మనసు దోచిన ఆ హీరో ఎవరో తెలుసా? ఈ స్టోరీ చదివాక మీరు ఆశ్చర్యపోతారు. ఈ విషయాన్ని మరో స్టార్ హీరో బయట పెట్టడం విశేషం.

Written By:
  • S Reddy
  • , Updated On : October 22, 2024 / 08:48 AM IST

    Samantha(5)

    Follow us on

    Samantha: సమంత పరిశ్రమలో ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఆమె స్టార్ అయ్యారు. ఇక టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో సమంత జతకట్టింది. నాగ చైతన్య, ఎన్టీఆర్ వంటి హీరోలతో అత్యధిక చిత్రాలు చేసింది. కాగా ఆమెకు ఓ హీరో అంటే చాలా ఇష్టం అట. ఈ విషయాన్ని హీరో అల్లు అర్జున్ వెల్లడించడం విశేషం. సమంతకు ఇష్టమైన హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అత్తారింటికి దారేది మూవీలో సమంత-పవన్ కళ్యాణ్ జంటగా నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.

    అత్తారింటికి దారేది తమిళ, కన్నడ భాషల్లో సైతం రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా అత్తారింటికి దారేది చెప్పొచ్చు. అత్తారింటికి దారేది షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తో సమంతకు పరిచయం ఏర్పడింది. కాగా అల్లు అర్జున్ కి జంటగా సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం చేసింది సమంత. ఈ మూవీ సెట్స్ లో అస్తమానం సమంత పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడేదట. ఆయన చాలా మంచివారు. ఆయన వ్యక్తిత్వం గొప్పదని సమంత అనేవారట.

    షూటింగ్ లో ఏ మాత్రం విరామం దొరికిన సమంత పవన్ కళ్యాణ్ సంగతులే పంచుకునేదట. సమంతకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని అల్లు అర్జున్ గతంలో వెల్లడించారు. ఇక అత్తారింటికి దారేది అనే టైటిల్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సెట్ కాదని కొందరు అన్నారు. కానీ ఆ సినిమాకు అదే కరెక్ట్ టైటిల్. అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తి సైతం ఆ కథకు బాగా సెట్ అయ్యిందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

    ఇక సమంత-అల్లు అర్జున్ జంటగా నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సైతం మంచి విజయం సాధించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూడు చిత్రాలు చేశారు. అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. పుష్ప మూవీలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. ఊ అంటావా మామా… సాంగ్ దేశాన్ని ఊపేసింది. సమంత బోల్డ్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసింది.

    మరోవైపు విడాకులు తీసుకున్న సమంత సింగిల్ స్టేటస్ అనుభవిస్తుంది. నాగ చైతన్య మాత్రం రెండో పెళ్లి చేసుకుంటున్నారు. శోభిత-నాగ చైతన్య పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. వైజాగ్ లో వివాహం జరగనుంది. సోషల్ మీడియాలో శోభిత తన పెళ్లి వేడుకల ఫోటోలు షేర్ చేశారు. అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.