https://oktelugu.com/

NTR’s : డ్రాగన్ లో ఎన్టీయార్ క్యారెక్టరైజేషన్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న ప్రశాంత్ నీల్…

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి గుడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక ఆయన చేసిన ప్రతి సినిమాలో తన క్యారెక్టరైజేషన్ ని చాలా అద్భుతంగా ఉండే విధంగా తీర్చిదిద్దుకుంటూ ఆ క్యారెక్టర్ లో తన బెస్ట్ పెర్ఫామెన్స్ ని ఇస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 22, 2024 / 08:39 AM IST

    NTR Dragon

    Follow us on

    NTR’s : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర ‘ సినిమా రీసెంట్ గా రిలీజై మంచి విజయాన్ని సాధించింది. ఇక ప్రేక్షకులందరు ఈ సినిమా మీద పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమాని మొదటి నుంచి చివరి వరకు కొరటాల శివ ఎంగెజింగ్ గా తీసుకెళ్లాడు. అలాగే ఎన్టీఆర్ కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో సినిమాని మరొక లెవల్ కి తీసుకెళ్లడం అనేది ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక దాంతో ఈ సినిమాను చూడడానికి ఎగబడిన ప్రేక్షకులు మొత్తానికైతే ఈ సినిమాని సక్సెస్ గా నిలిపారు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా సెట్స్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్లో పాల్గొన్న ఆయన ఇక మీదట కంటిన్యూస్ గా ఆ సినిమా షూటింగ్ లో పాల్గొని మొదట దాన్ని పూర్తి చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నాడు. నిజానికి ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమాలో తన మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.

    ఎన్టీఆర్ లుక్కు పరంగా అన్ని సినిమాల్లో దాదాపు ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాడు. చిన్న చిన్న వేరియేషన్స్ తప్ప ఆయన క్యారెక్టర్ లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. కాబట్టి ప్రశాంత్ నీల్ ఆయన క్యారెక్టర్ ని పూర్తిగా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఈ సినిమాలో కొద్దిసేపు నెగటివ్ పాత్రలో కనిపించి ఆ తర్వాత పాజిటివ్ గా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఎన్టీయార్ పూరి జగన్నాథ్ తో చేసిన ‘టెంపర్’ సినిమాలో కూడా ఆయన క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది. కాబట్టి డ్రాగన్ సినిమాలో కూడా అలా ఉన్నప్పటికి దాని చేంజ్ ఓవర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

    మరి ప్రశాంత్ నీల్ అనుకున్నట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ తన క్యారెక్టర్జేషన్ లో ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ ని కనక చూపించినట్లైతే నటనలో ఆయనను మించిన నటుడు మరొకరు ఉండరంటూ సినీ విమర్శకులు సైతం ఎన్టీఆర్ విషయంలో స్పందించడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ కాంబో పైన ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అవుతుంది… సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి భారీ సక్సెస్ ని అందిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…