Bigg Boss 7 Contestants Remuneration: బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభంతో షో ఫ్యాన్స్ టీవీ ముందు అతుక్కుపోతున్నారు. ఈసారి హౌస్ లోకి సినీ తారలతో పాటు టీవీ సీరియల్ నటులు ఎక్కువ మంది ఎంట్రీ ఇచ్చారు. వీరు సీరియళ్ల ఆడియన్స్ తోపాటు సోషల్ మీడియాలో యూత్ ను బాగా ఆకట్టుకున్నారు. కొందరు నటుల అభిమానులు వారికి సపోర్టుగా ఉంటామని ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లపై ఆసక్తి చర్చ సాగుతోంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినందుకు ఒక్కో కంటెస్టెంట్ ఎంత తీసుకుంటున్నారు? అని చాలా మంది చర్చలు పెడుతున్నారు. అసలు ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఉంటుందో ఒకసారి చూద్దాం.
సీరియల్ నటుడిగా ఫేమస్ అయిన అమర్ దీప్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఇతనికి ఫాలోవర్స్ విపరీతంగా ఉన్నారు. ఈయనకు హౌస్ లోకి వచ్చినందుకు ఒక వారానికి రూ.2.5 లక్షలు ఇస్తున్నారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కూడా ఇంతే రెమ్యూనరేషన్ అందుకుంటాడని సమాచారం. తెలుగు సినీ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న దామినికి మంచి ఇమేజ్ ఉంది. దీంతో ఆమెకు రూ.2 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఆకాశ వీధుల్లో అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన గౌతమ్ కృష్ణకు ఒక వారం పాటు రూ.1.5 లక్షలు ఇస్తున్నారు.
కామన్ మ్యాన్ కోటాలో రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా ఫేమస్ అయ్యారు.ఈయనకు వారానికి లక్ష రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్ లో తొలి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ప్రియాంక జైన్ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయ్యారు. ఈమె యూట్యూబ్ లో సొంత ఛానెల్ పెట్టి గుర్తింపు పొందారు. ఈమెకు వారానికి రూ.2.5 లక్షలు తీసుకుంటారు. రతికా రోజ్ అనే బ్యూటీకి వారానికి రూ.1.75 లక్షలు తీసుకుంటుంది. హాట్ భామగా పేరొందిన షకీలా అత్యధికగా వారినికి రూ.3.75 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.
కార్తీక దీపం సీరియల్ లో మోనిత ఫేమస్ అయినా శోభా శెట్టికి వారానికి రూ. 2 లక్షలు ఇస్తున్నారు. సీనియర్ నటుడు శివాజీకి వారానికి రూ.3 లక్షలు ఇస్తారు. లాయర్ గా గుర్తింపు పొందిన శుభశ్రీ రాయగురు వారానికి రూ.2 లక్షలు తీసుకుంటుంది. ఫుడ్ వీడియోలతో పాపులర్ అయినా టేస్టీ తేజ కు వారం రోజులకు రూ.1.75 లక్షలు ఇస్తారు. మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన యావర్ కు రూ.లక్ష ఇస్తున్నారు.