https://oktelugu.com/

Chandamama: చందమామ సినిమాలో కాజల్ కి డబ్బింగ్ చెప్పింది ఆ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

కాజల్ అగర్వాల్ చాలా అద్భుతమైనటువంటి నటనతో ప్రేక్షకులందరిని ఫిదా చేసింది. ఈ సినిమాతోనే ఆమెకి మగధీర సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కి డబ్బింగ్ చెప్పింది మాత్రం ఒక స్టార్ హీరోయిన్ అనే విషయం ఎవరికి తెలియదు.

Written By:
  • Gopi
  • , Updated On : March 18, 2024 / 06:08 PM IST

    Chandamama

    Follow us on

    Chandamama: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎంతమంది ఉన్నప్పటికీ హీరోయిన్లను మాత్రం ముంబై నుంచి తీసుకు వస్తుంటారు. ఎందుకంటే తెలుగు అమ్మయిలేవరు సినిమా ఇండస్ట్రీకి రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కాబట్టి హీరోయిన్లు కొరతనేది చాలా ఎక్కువగా ఉంది. అందువల్లే నార్త్ నుంచి హీరోయిన్లను తీసుకువచ్చి వాళ్ల చేత సినిమాలు చేయిస్తూ వాళ్ళకి సక్సెస్ లను అందిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కృష్ణవంశీ డైరెక్షన్ లో నవదీప్,శివ బాలాజీ లు హీరోలుగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వచ్చిన చందమామ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.

    అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చాలా అద్భుతమైనటువంటి నటనతో ప్రేక్షకులందరిని ఫిదా చేసింది. ఈ సినిమాతోనే ఆమెకి మగధీర సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కి డబ్బింగ్ చెప్పింది మాత్రం ఒక స్టార్ హీరోయిన్ అనే విషయం ఎవరికి తెలియదు. ముఖ్యంగా కాజల్ అగర్వాల్ కు తెలుగు రాదు. దానివల్ల తనకు డబ్బింగ్ ఆర్టిస్టు లతో చాలా అవసరం ఉంటుంది. అయితే ఈ సినిమా కోసం కృష్ణవంశీ రెగ్యులర్ గా తనకు డబ్బింగ్ చెప్పే వాళ్ళను కాకుండా తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన ఛార్మి చేత ఆమె క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పించారు.

    దాంతో ఆమె క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవ్వడమే కాకుండా ఛార్మి వాయిస్ కూడా ఆమెకు చాలా బాగా యాప్టయింది. దానివల్లే ఆమె క్యారెక్టర్ కి మంచి పేరు గుర్తింపు లభించాయి. ఇక మొత్తానికైతే ఛార్మి గాత్రంతో కాజల్ ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో కాజల్ వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగింది.

    ఇక మొత్తానికైతే తను ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి మంచి విజయాలను అందుకుంది. ఇక ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకొని తన ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయినప్పటికీ, అవకాశం వచ్చిన ప్రతిసారి తనని తను ప్రూవ్ చేసుకుంటూ సినిమాలో నటిస్తుంది. ఇక రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమాలో కూడా బాలయ్య పక్కన నటించి మంచి మార్కులు కొట్టేసింది…