Nani Paradise: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంది. ఒకప్పుడు ఇతర భాషల్లో మన సినిమాలను డచ్ చేయాలన్న కూడా చాలా ఇబ్బందులు ఉండేవి. వేరే భాషల్లో ఉన్న దర్శక నిర్మాతలు మన హీరోలమీద సినిమాల పెద్దగా ఆసక్తిని చూపించేవారు కాదు. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి పాన్ ఇండియా సినిమాలను చేస్తూ మన దర్శకులు ముందుకు సాగుతున్నారు. మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్లోకి తీసుకెళ్లారు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా నేపథ్యంలో పలు భాషల నుంచి సినిమాలు వస్తున్నప్పటికి తెలుగు సినిమాలను మించిన సినిమాలైతే ఏవి రావడం లేదు. అనేది చాలా క్లారిటీగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న స్టార్ హీరోలందరు నెంబర్ వన్ పొజిషన్ కోసం విపరీతంగా ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక నాని లాంటి హీరో సైతం కెరియర్ మొదట్లో సాఫ్ట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగినప్పటికి ఇప్పుడు మాత్రం మాస్ సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. మరి ఆయన చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం… నాని శ్రీకాంత్ ఓదెలతో ఇంతకుముందే దసర అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. మరి వీళ్ళ కాంబినేషన్లో మరోసారి మరో సినిమా వస్తోంది. ప్యారడైజ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలను తారస్థాయికి వెళ్ళిపోయాయి…
Also Read: బీరు తాగుదామని.. మూత తెరిచాడు.. షాకింగ్ వీడియో
ఈ సినిమా నుంచి గ్లింప్స్ రావడమే ఆలస్యం ప్రేక్షకులందరు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అంటు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు… ఇక ఇప్పటివరకు నాని చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది అంటూ నాని అభిమానులు సైతం మంచి కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు…
ఈ సినిమాలో నాని చాలా బోల్డ్ డైలాగ్స్ చెప్పబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాలో నాని ని ఒక వ్యక్తి వెన్నుపోటు పొడుస్తాడట… ఇంతకీ ఆయన ఎవరు అనేది ఎక్కడ రివిల్ చేయడం లేదు కానీ ఆ పాత్రకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట…ఇక అందులో భాగంగానే నాని చివర్లో చనిపోతారు అంటూ కొన్ని కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో నాని టైర్ వన్ హీరోగా మారతాడా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడున్న స్టార్ హీరోలందరు ఇండస్ట్రీ ని షేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుంటే నాని సైతం పాన్ వరల్డ్ సినిమా చేస్తూ వాళ్ళందరికి పోటీని ఇవ్వడానికి రెడీ అవుతున్నాను అంటూ చెప్పడం విశేషం…