Anirudh Ravichander: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు మంచి కథలతో సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే దర్శకులు వాళ్ళ కథలకు న్యాయం చేయగలిగే టెక్నీషియన్స్ ని తీసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక కథని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేయాలంటే దానికి తగ్గ టెక్నీషియన్స్ ఉన్నప్పుడే అది వర్కౌట్ అవుతోంది అనే ధోరణిలో వాళ్ళు ఆలోచించి ఆ టెక్నిషియన్స్ ను తీసుకుంటున్నారు. సినిమా సక్సెస్ లో మ్యూజిక్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో అనిరుధ్ ఒకరు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు వాళ్ల సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు రాబోతున్న స్టార్ హీరోల సినిమాలన్నింటికి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం… ఇక ఈరోజు రిలీజ్ అయిన రజనీకాంత్ కూలీ సినిమాకి కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్ కావడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
Also Read: ‘ప్యారడైజ్’ లో నాని ని వెన్నుపోటు పొడిచేది ఎవరో తెలుసా..?
ఆయన చేసిన ప్రతి సినిమాకి మంచి మ్యూజిక్ ని ఇవ్వడమే కాకుండా సిచువేషన్ కి తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్ ని ఇచ్చి చాలా సన్నివేశాలను ఎలివేట్ చేయడం కోసం ఆయన తీవ్రమైన కృషి చేశాడు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్న సినిమా రిలీజ్ అయిందంటే అది చూసిన ప్రతి ఒక్కరు ఆయన మ్యూజిక్ గురించి ఆయనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటుటారు…
మరి అనిరుధ్ ను చాలా మంది దర్శకులు నమ్మడానికి గల కారణం ఏంటి అంటే ఒక్కోసారి ఆయన మ్యూజిక్ సరిగ్గా ఇవ్వకపోయిన కూడా ఆ సీన్స్ లో ఉండే ఎమోషన్ ని బాగా పట్టుకొని దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని ఇచ్చి ఆ ఎలివేషన్ ప్రాపర్ గా వర్క్ అవుట్ అయ్యే విధంగా చూసుకుంటాడు. అందుకే అతన్ని నమ్మి చాలా పెద్ద సినిమాలను అతని చేతుల్లో పెడుతున్నారు.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో కొన్ని మూవీస్ కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మ్యూజిక్ డైరెక్టర్లు ఎంత మంది ఉన్న కూడా వాళ్ళలో అనిరుధ్ కి మాత్రమే చాలా ఎక్కువ గుర్తింపు ఉందని చెప్పాలి. ప్రస్తుతానికి అతని చేతుల్లోనే చాలా ఎక్కువ సినిమాలు ఉన్నాయి…