https://oktelugu.com/

Star Heroes: డబుల్‌ రోల్స్‌ చేసిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? అందులో అన్ని సినిమాలు హిట్‌ అంతే!

అయితే ఎక్కువగా కొంత మంది హీరోలు డ్యూయల్‌ రోల్‌ పోషించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొంత మంది హీరోలు డబుల్‌ రోల్‌లో సక్సెస్‌ సాధిస్తే.. మరికొందరూ ఫెయిల్యూర్‌ సాధిస్తారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 25, 2023 / 03:34 PM IST
    Follow us on

    Star Heroes: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.. వేల మంది ఈ రంగంలో ఉన్నా.. సక్సెస్‌ మాత్రం కొందరినే వరిస్తుంది. అందరూ శ్రమిస్తున్నా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే సక్సెస్‌ వస్తుందే.. ఒకప్పుడు సినిమా వంద రోజులు ఆడితేనే సక్సెస్‌ అనేవారు. కానీ ఇప్పుడు రెండు మూడు వారాలు హౌస్‌ఫుల్‌ నడిచినా.. భారీగా ఆదాయం వస్తోంది. దీంతో నిర్మాతలు ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలు కూడా తీస్తున్నారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు రకరకాల పాత్రలు చేస్తుంటారు. అయితే ఎక్కువగా కొంత మంది హీరోలు డ్యూయల్‌ రోల్‌ పోషించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొంత మంది హీరోలు డబుల్‌ రోల్‌లో సక్సెస్‌ సాధిస్తే.. మరికొందరూ ఫెయిల్యూర్‌ సాధిస్తారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

    జూనియర్‌ ఎన్టీఆర్‌..
    జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆంధ్రావాలా మూవీలో డబుల్‌ రోల్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీని తరువాత అదుర్స్‌ సినిమాలో డబుల్‌ రోల్‌లో కనిపించి మెప్పించినా ఆయన ఈసినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. శక్తి మూవీలో కూడా మరోసారి డబుల్‌ రోల్‌ చేసి మరోసారి డిజాస్టర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత జై లవకుశ సినిమాలో ట్రిపుల్‌ రోల్‌ చేసి సక్సెస్‌ సాధించాడు. మొత్తం నాలుగు సినిమాల్లో ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్లలో కనిపించి అందులో రెండు హిట్లు, రెండు ఫ్లాప్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు.

    పవర్‌ స్టార్‌.. పవన్‌ కళ్యాణ్‌ ..
    పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తీన్‌మార్‌ సినిమాలో డబుల్‌ రోల్‌లో నటించాడు. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. దీంతో మళ్లీ డబుల్‌ రోల్‌ ఉన్న సినిమాలో నటించలేదు పవన్‌ కళ్యాణ్‌.

    మాస్‌ మహారాజ్‌ రవితేజ..
    మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాడు. ఆయన డబుల్‌ రోల్‌ చేసి మంచి విజయం అందుకున్న సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి. ఈ సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టాడు రవితేజ.

    మెగా పవర్‌ స్టార్‌.. రామ్‌ చరణ్‌..
    ఇండస్ట్రీలో ఉన్న టాప్‌ హీరోలలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ఒకరు. ఆయన తీసిన సినిమాల్లో చాలా వరకు హిట్‌ సాధించాయి. అందులో రామ్‌ చరణ్‌ డబుల్‌ రోల్‌ చేసి సక్సెస్‌ సాధించిన సినిమాల్లో మగధీర ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. ఈ సినిమా తరువాత మంచి విజయం సాధించిన మరో సినిమా నాయక్‌. ఈ రెండు సినిమాల్లో కూడా ఆయన సూపర్‌గా నటించి మంచి పేరు సంపాదించాడు.

    రెబల్‌ స్టార్‌.. ప్రభాస్‌..
    ప్రభాస్‌ కూడా డ్యుయల్‌ రోల్‌ నటించి మంచి విజయాన్ని సాధించాడు. అందులో బిల్లా మూవీ ఒకటి. బాహుబలి సినిమాలో కూడా ప్రభాస్‌ డబుల్‌రోల్‌లో నటించి మెప్పించాడు. బాహుబలి మూవీతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌ హీరో అయ్యారు. అప్పటి నుంచి ప్రభాస్‌ ఏ సినిమా తీసినా పాన్‌ ఇండియా రేంజ్‌లో నటిస్తున్నాడు.