Homeఎంటర్టైన్మెంట్Top Television Heroines: టాప్ 5 బుల్లితెర హీరోయిన్స్ ఎవరో తెలుసా?

Top Television Heroines: టాప్ 5 బుల్లితెర హీరోయిన్స్ ఎవరో తెలుసా?

Top Television Heroines: కొత్త కథలతో కొత్త కొత్త సీరియల్స్ చేస్తూ అభిమానులను అలరించడానికి బుల్లితెర ఎప్పుడు రెడీగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ పక్క రాష్ట్రాల నటులకూ గొప్ప అవకాశాలు ఇస్తోంది. ప్రతి సీరియల్ చాలా కొత్తగా, ఇంట్రస్టింగ్‌గా, అద్భుతమైన పాత్రలతో అలరిస్తున్నాయి. ప్రతి సీరియల్‌కూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. దాంతో పాటుగా ప్రతి సీరియల్‌లో ఒక నటికి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వారు కనిపిస్తేనే ఛానెల్ టీఆర్‌పీ రాకెట్‌లా దూసుకుపోతుంది. సీరియల్స్ ఏవీ కూడా సినిమాల తరహాలో రెండు గంటల్లో అయిపోవు. రోజులు నెలలు గడుస్తున్నా కథలో పట్టు కోల్పోకుండా, ఉత్కంఠ పోకుండా, కొత్త ప్రేక్షకులను అందిపుచ్చుకునేలా ఉండాలి. వీటన్నింటినీ సీరియల్ టీం అంతా ఎంతో అద్భుతంగా పాటిస్తుంది. సంవత్సరాల తరబడి టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ కూడా చిట్టచివరి ఎపిసోడ్ వరకు కూడా తొలి ఎపిసోడ్ టెన్షన్‌ను కొనసాగిస్తున్నాయి.

తెలుగు బుల్లితెర పేరు చెబితే కొంత మంది స్టార్లే గుర్తుకు వస్తారు. బుల్లితెరను ఏలుతూ.. తమదైన పాత్ర పోషిస్తూ.. టాప్ లో ఉంటున్నారు ఈ ముద్దుగుమ్మలు. అవును ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా?

1. అశ్మితా కర్ణాని: మాతృదేవోభవ, భాగ్యరేఖ, మట్టిగాజులు సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి ‘అశ్మితా కర్ణాని’. ‘పద్మవ్యూహం’ సీరియల్‌లో గౌరి పాత్రతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈమె ఆ తర్వాత తెలుగు సీరియల్స్‌లో కీలకంగా మారింది. ఇప్పటివరకు ఈమె 15కు పైగా సీరియల్స్‌లో నటించింది. ఆమె నటనతోనే ఆమెకు కొత్తకొత్త అవకాశాలు వస్తున్నాయి.

2. ఐశ్వర్య పిస్సే: ‘అగ్నిసాక్షి’ సీరియల్‌లో గౌరీ పాత్రతో అందరినీ మెప్పించిన ఈ చిన్నది కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ టెలివిజన్లలోనూ చక్రం తిప్పుతోంది. ఆమె 2015 నుంచి సీరియల్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా సీరియల్స్ చేస్తూ ప్రతి పాత్రలో తన మార్క్‌ను చూపిస్తోంది. మూడు ఇండస్ట్రీల్లో కూడా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పటికప్పుడు స్పెషల్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఐశ్వర్యకు ఐశ్వర్యే సాటి.

3. మేఘనా లోకేష్: సీరియల్స్‌లోకి రాకముందు నుంచే ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలి అన్న విషయంలో మేఘనది అందె వేసిన చేయి. దాదాపు 270కి పైగా షోలు చేసింది. పలు సినిమాల్లో కూడా రాణించింది. ‘దేవి’ సీరియల్‌లో సపోర్టింగ్ రోల్ చేసిన మేఘన ‘పవిత్ర బంధం’లో కీ రోల్ చేసింది. ఇండస్ట్రీలో ‘శిశిరేఖా పరిణయం’ సీరియల్ మేఘనా బ్లాక్‌బస్టర్ పర్ఫార్మెన్స్‌కు నిదర్శనం. 2013లో ప్రారంభమైన ఆమె కెరీర్ బ్రేకులు లేని బండిలా దూసుకుపోతోంది.

4. సమీరా షెరీఫ్: తెలుగు, తమిళ సీరియల్ ఇండస్ట్రీల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ ‘సమీరా షెరీఫ్’. సమీరా 15ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఆడపిల్ల’ షోతో కెరీర్ స్టార్ట్ చేసిన సమీరా.. ప్రతిబింబం, మనవరాలు వంటి అద్భుతమైన సీరియల్స్‌లో కీలక పాత్రలో సమీరా అలరించింది. తన నటనకు అనేక అవార్డులు రివార్డులు కూడా అందుకుంది.

5. సుహాసిని: టాప్ తెలుగు టెలివిజన్ నటీమణుల జాబితాలో సుహాసిని పేరు కచ్చితంగా ఉంటుంది. తెలుగుతో పాటు భోజ్‌పురిలో పలు సినిమాల్లో ఆమె నటించింది. ‘అపరంజి’ సీరియల్‌తో సుహాసిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తన తొలి సీరియల్‌తోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిన సుహాసిని మళ్లీ 2015లో ‘ఇద్దరు అమ్మాయిలు’ సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version