Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో గత 40 సంవత్సరాల నుంచి స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్న ఏకైక హీరో రజనీకాంత్… ప్రస్తుతం రజనీకాంత్ తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా స్టార్ హీరోగా వెలుగొందుతుండడం అంటే మామూలు విషయం కాదు. అలాగే తన అభిమానుల కోరిక మేరకు హీరోగా నటిస్తూ తనను తాను మౌల్డ్ చేసుకుంటున్న విధానం ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. ఇక పాతికేళ్ల వయసులోనే ఏమీ చేయలేక ఖాళీగా కూర్చుంటున్న యువతకి 70 ఏళ్ల వయసులో రజనీకాంత్ సాధిస్తున్న రికార్డులను చూసి సిగ్గుపడాల్సిన అవసరమైతే ఉంది. ఇక ‘కృషి ఉంటే తప్పకుండా మనుషులు ఋషులవుతారు’ అనే మాటకి రజినీకాంత్ ను మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు…ఇక ఇదిలా ఉంటే ఆయన సినిమాలతో తమిళ్ ప్రేక్షకులనే కాకుండా తెలుగు వాళ్ళని కూడా మంత్రముగ్ధుల్ని చేసిన విషయం మనకు తెలిసిందే. తమిళం లో ఆయన సినిమాలకి ఎలాగైతే భారీ ఓపెనింగ్స్ వస్తాయో తెలుగులో కూడా అంతటి భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ‘కూలీ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి ఆయన ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు…ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జనరేషన్ లో ఉన్న హీరోల్లో రజనీకాంత్ కి బాగా నచ్చిన హీరోలు ఇద్దరు ఉన్నారంట. ఇక అందులో ఒకరు పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు మహేష్ బాబు అని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా, అలాగే వ్యక్తిత్వ పరంగా ఆయన చేసే సామాజిక కార్యక్రమాల వల్ల రజనీకాంత్ కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమట. ఒకరకంగా చెప్పాలంటే స్వయం గా రజనీకాంత్ గారే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ కొన్ని సందర్భంలో తెలియజేశాడు…అలాగే సినిమాల పరంగా, నటన పరంగా, సేవా కార్యక్రమాల పరంగా మహేష్ బాబు అంటే కూడా తనకు చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఇక మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు అంటే రజనీకాంత్ కి అమితమైన ఇష్టం ఉండడంతో వాళ్ళు అభిమానులు సంబరపడిపోతున్నారు…
ఇక మొత్తానికైతే ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ ఇండియాలోనే టాప్ ఇండస్ట్రీ గా మారింది. కాబట్టి ఇప్పుడున్న హీరోలందరూ కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు… ఇక ఇప్పుడు రజినీకాంత్ కూలీ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను కూడా తిరగరాయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…