Homeఎంటర్టైన్మెంట్Liger Movie: షాకింగ్..లైగర్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Liger Movie: షాకింగ్..లైగర్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Liger Movie: ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఏదైనా ఉందా అంటే అది విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై యూట్యూబ్ ని షేక్ చేస్తుంది..విడుదలైన 24 గంటల్లోనే ఈ ట్రైలర్ దాదాపుగా 16 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం..టయర్ 2 హీరోలలో ఇది ఒక రికార్డు గా చెప్పుకోవచ్చు..ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగానే బిజినెస్ చేసే సూచనలు కలిపిస్తున్నాయి..ఈ చిత్రం తో విజయ్ దేవరకొండ టయర్ 2 నుండి టయర్ 1 హీరోల లిస్ట్ లోకి వెళ్ళిపోయినట్టు అనుకోవచ్చు..సినిమా హిట్ అయితే మాత్రం కచ్చితంగా వసూళ్ల సునామి సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..అయితే లైగర్ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..అదేమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Liger Movie
Liger Movie

ఇక అసలు విషయానికి వస్తే లైగర్ సినిమాని తొలుత విజయ్ దేవరకొండ తో చెయ్యాలని అనుకోలేదట ఆ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్..చాలా ఏళ్ళ క్రితమే ఈ స్టోరీ ని పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలతో చెయ్యాలని అనుకున్నాడట..ఎన్టీఆర్, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకు ఈ సినిమా కథని వినిపించాడట..అయితే వీళ్ళ డేట్స్ ఖాళి లేకపోవడం తో పూరి జగన్నాథ్ ఇక తప్పనిసరి పరిస్థితిలో విజయ్ దేవరకొండ తో చేసినట్టు తెలుస్తుంది.

Also Read: Ramarao On Duty: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా హిట్ అవ్వాలంటే ఎంత వసూలు చెయ్యాలో తెలుసా?

Liger Movie
NTR, Prabhas and Allu Arjun

వాస్తవానికి ఈ సినిమా చెయ్యడానికి ప్రభాస్ ఒప్పుకున్నాడు..కానీ అదే సమయం లో ఆయనకీ వరుసగా దీనికి మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ సబ్జక్ట్స్ రావడం తో ‘సారీ డార్లింగ్..ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ లో ఈ సినిమా నేను చెయ్యలేకపోవచ్చు..నా కోసం సమయం వేస్ట్ చేసుకోకుండా ఈ సబ్జెక్టు తో వేరే హీరో తో చేసుకో’ అని చెప్పాడట..దానితో ఈ సినిమాని విజయ్ దేవరకొండ తో సెట్ చేసాడు పూరి జగన్నాథ్..సినిమా కూడా బాగా వచ్చిందట..పూరి జగన్నాథ్ తన ఆశలని ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు..పాన్ ఇండియా లెవెల్ లో రీసౌండ్ వచ్చేలా బ్లాక్ బస్టర్ కొట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ ని ఘనంగా ప్రారంభించాలని అనుకుంటున్నాడు..మరి ఆయన ఆశలను ఈ సినిమా నిలబెడుతుందో లేదో తెలియాలంటే ఆగష్టు 25 వరుకు వేచి చూడాల్సిందే.

Also Read:Thank You Movie Collections: ‘జీరో’ షేర్ ని సాధించే దిశగా అడుగులు వేస్తున్న అక్కినేని నాగచైతన్య ‘థాంక్యూ’ చిత్రం
Recommended Videos
లైగర్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోలు || Star Heros Rejected Liger Movie || Vijay Devarakonda

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version