https://oktelugu.com/

Ramarao On Duty: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా హిట్ అవ్వాలంటే ఎంత వసూలు చెయ్యాలో తెలుసా?

Ramarao on Duty: ‘క్రాక్’ మరియు ‘ఖిలాడీ’ వంటి చిత్రాల తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..నూతన దర్శకుడు షేర్ మండువా తెరకెక్కించిన ఈ సినిమా ట్రేడ్ సర్కిల్స్ లో మంచి పాజిటివ్ బజ్ ని ఏర్పర్చుకుంది..ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోవడం తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 25, 2022 12:24 pm
    Follow us on

    Ramarao on Duty: ‘క్రాక్’ మరియు ‘ఖిలాడీ’ వంటి చిత్రాల తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..నూతన దర్శకుడు షేర్ మండువా తెరకెక్కించిన ఈ సినిమా ట్రేడ్ సర్కిల్స్ లో మంచి పాజిటివ్ బజ్ ని ఏర్పర్చుకుంది..ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోవడం తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రవితేజ కెరీర్ లో హైయెస్ట్ గా నిలిచింది..క్రాక్ సినిమా సంచలన విజయం సాధించి రవితేజ మార్కెట్ ని డబుల్ చెయ్యడం తో రామారావు ఆన్ డ్యూటీ సినిమాకి ట్రేడ్ లో ఈ రేంజ్ బజ్ ఏర్పడింది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా దాదాపుగా 47 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్నట్టు తెలుస్తుంది..ఇది రవితేజ కెరీర్ లోనే కాదు మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు.

    Ramarao on Duty

    Ravi teja

    ఇటీవలే విడుదలైన హీరో రామ్ ‘ది వారియర్’ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 45 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది..మొన్నటి వరుకు మీడియం రేంజ్ హీరోలలో ఇదే రికార్డు..ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ద్వారా రవితేజ ఆ రికార్డుని రెండు వారాల్లోనే బ్రేక్ చెయ్యడం విశేషం..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కును అందుకొని సూపర్ హిట్ గా నిలబడాలంటే 50 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యాలి.

    Also Read: Thank You Movie Collections: ‘జీరో’ షేర్ ని సాధించే దిశగా అడుగులు వేస్తున్న అక్కినేని నాగచైతన్య ‘థాంక్యూ’ చిత్రం

    Ramarao on Duty

    Ravi teja

    ఆ స్థాయి వసూళ్లు రావాలంటే ఓపెనింగ్స్ అదిరిపోవాలి..మొదటి రోజు కనీసం 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ కేవలం తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టాలి..అదే ట్రెండ్ ని వీకెండ్ వరుకు కొనసాగించి వీకెండ్ కో పాతిక కోట్ల రూపాయలకు పైగా షేర్ ని సాధించేలా ఉండాలి..ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి డైలీ షేర్స్ ని మైంటైన్ చేస్తూ రెండవ వారం, మూడవ వారం కూడా మంచి వసూళ్లను రాబడితే ఫుల్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే ఛాన్స్ ఉంది..ఈ స్థాయి రన్ రావాలంటే సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడం తప్పనిసరి..ఏ మాత్రం టాక్ తేడా అయినా డిజాస్టర్ ఫ్లాప్ గా నిలవడం పక్కా..మరి ట్రైలర్ , పాటలతో అభిమానుల్లో మంచి అంచనాలను ఏర్పర్చిన ఈ సినిమా ఆ అంచనాలకు తగ్గుట్టుగానే మంచి టాక్ ని సొంతం చేసుకొని అద్భుతమైన వసూళ్లను సాధిస్తుందో లేదో చూడాలి.

    Also Read:Sai Pallavi: సాయిపల్లవి బోనమెత్తితే ఎట్టుంటాదో తెలుసా?

    Tags