https://oktelugu.com/

Bheemla Nayak Records: చెక్కు చెదరకుండా నిలబడిన ‘భీమ్లా నాయక్’ రికార్డ్స్..పవర్ స్టార్ ని మించిన హీరో ఇండస్ట్రీ లో లేదా?

Bheemla Nayak Records: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ అనితర సాధ్యం అనే విషయాన్నీ మరోసారి నిజం చేసింది ఈ ఏడాది విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది..అతి తక్కువ టికెట్ రేట్స్ మీద విడుదలైనా కూడా ఈ సినిమా వంద కోట్ల రూపాయిలు వసూలు చెయ్యడం గమనార్హం..ఇటీవల విడుదలైన లేటెస్ట్ స్టార్ హీరోల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 25, 2022 / 12:50 PM IST
    Follow us on

    Bheemla Nayak Records: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ అనితర సాధ్యం అనే విషయాన్నీ మరోసారి నిజం చేసింది ఈ ఏడాది విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది..అతి తక్కువ టికెట్ రేట్స్ మీద విడుదలైనా కూడా ఈ సినిమా వంద కోట్ల రూపాయిలు వసూలు చెయ్యడం గమనార్హం..ఇటీవల విడుదలైన లేటెస్ట్ స్టార్ హీరోల సినిమాలు రాధే శ్యామ్ , #RRR , ఆచార్య, KGF చాప్టర్ 2 మరియు సర్కారు వారి పాట వంటి సినిమాలకు భీమ్లా నాయక్ సినిమాకంటే రెండింతలు ఎక్కువ టికెట్ రేట్స్ తో విడుదలయ్యాయి..వీటిల్లో KGF చాప్టర్ 2 , #RRR సినిమాలు మాత్రమే వంద కోట్ల రూపాయలకు పైగా షేర్స్ ని సాధించాయి..కానీ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా అతి తక్కువ టికెట్ రేట్స్ తో వంద కోట్ల మార్కును అందుకోవడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా కి నిదర్శనం గా చెప్పుకోవచ్చు..అయితే ఈ సినిమా సాధించిన కొన్ని రేర్ రికార్డ్స్ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదలైనప్పటికీ కూడా బ్రేక్ చేయలేకపోవడం విశేషం.

    pawan kalyan

    భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీని కేవలం పది రోజుల ముందు మాత్రమే ప్రకటించారు..తక్కువ సమయం లో విడుదల తేదీ ఇవ్వడం తో ప్రొమోషన్స్ కూడా చేయలేకపోయారు..దీనితో అభిమానులు ఈ సినిమా కి పవర్ స్టార్ రేంజ్ ఓపెనింగ్ వస్తుందా లేదా అని కంగారు పడ్డారు..కానీ అందరిలాంటి హీరో అయితే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలా అవుతాడు..తక్కువ సమయం లో విడుదల తేదీ ప్రకటించినా, ప్రొమోషన్స్ మరియు ఇంటర్వూస్ లాంటివి ఏమి ఇవ్వకపోయినా కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ అమెరికా నుండి అనకాపల్లి వరుకు మారుమోగిపోయ్యాయి.

    Also Read: Liger Movie: షాకింగ్..లైగర్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

    pawan kalyan

    అమెరికా లో అయితే ప్రీమియర్స్ లో దాదాపుగా 9 లక్షల డాలర్స్ ని వసూలు చేసిన ఈ చిత్రం..ఫుల్ రన్ లో 2.48 మిలియన్ డాల్లర్ల వసూళ్లను రాబట్టింది..ఒక్క #RRR సినిమా మినహా ఈ రికార్డు ని ఒక్కరు కూడా దాటలేకపొయ్యారు..ఓవర్సీస్ కింగ్ అనే పేరున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట సినిమా తో ఈ రికార్డు ని అధిగమించలేకపోయారు..ఇక నైజం లో కూడా ఇదే పరిస్థితి..ఈ సినిమా మొదటి రోజు ఇక్కడ దాదాపుగా 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు గా నిలిచింది..ఈ రికార్డు ని ప్రభాస్ , మహేష్ , చిరంజీవి వంటి వారు కూడా బ్రేక్ చేయలేకపోయారు..ఫుల్ రన్ లో నైజం ప్రాంతం లో భీమ్లా నాయక్ సినిమా 35 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఈ రికార్డు ని ఇటీవల విడుదలైన సినిమాలలో #RRR మరియు KGF వంటి పాన్ ఇండియా సినిమాలు మినహా ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారు..అలా పవర్ స్టార్ సాధించిన ఈ రికార్డ్స్ ని ఇప్పటి వరుకు ఎవ్వరు ముట్టుకోలేకపోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది..ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమాకి అన్ని సినిమాలకు ఇచ్చినట్టు టికెట్ రేట్స్ ఇచ్చి ఉంటె కచ్చితంగా 130 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    Also Read:Thank You Movie Collections: ‘జీరో’ షేర్ ని సాధించే దిశగా అడుగులు వేస్తున్న అక్కినేని నాగచైతన్య ‘థాంక్యూ’ చిత్రం

    Tags