Homeజాతీయ వార్తలుIndia Pakistan relations : మీరెవరు మాకు చెప్పేందుకు.. అంతర్జాతీయ కోర్టుపై భారత్‌ ఆగ్రహం!

India Pakistan relations : మీరెవరు మాకు చెప్పేందుకు.. అంతర్జాతీయ కోర్టుపై భారత్‌ ఆగ్రహం!

India Pakistan relations : పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున పాకిస్తాన్‌పై భారత్‌ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా 1969 నాటి సిందూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్‌కు నీటి సరఫరా నిలిపివేసింది. సిందూ నదిపై కొత్తగా ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పాకిస్తాన్‌లో పంటలు ఎండుతున్నాయి. కరువు ఛాయలు అలుముకున్నాయి. సిందూ జలాలు ఇవ్వకపోతే రక్తం పారిస్తామని బెదిరించింది. కానీ భారత్‌ భయపడలేదు. దీంతో నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు భారత్‌ను వివరాలు కోరింది. కోర్టు ఆదేశాలను భారత్‌ స్పష్టంగా తిరస్కరించింది. జలవిద్యుత్‌ ప్రాజెక్టుల ’పాండేజ్‌ లాగ్‌బుక్‌’లు సమర్పించాలని కోరినా, భారత్‌ దాన్ని పాటించే ప్రసక్తి లేదని ప్రకటించింది. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో పీస్‌ ప్యాలెస్‌లో జరిగిన విచారణకు భారత్‌ దూరంగా ఉంది.

మధ్యవర్తిత్వం అక్రమం..
భారత్‌ పేర్కొన్న ముఖ్య అంశం, సీవోఏ ఏర్పాటు చట్టవిరుద్ధం. దానికి ఎటువంటి చట్టబద్ధత లేదని కొట్టిపారేసింది. 2025 ఏప్రిల్‌ 23న సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసిన నేపథ్యంలో ఈ ప్రతిష్టంభన. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరుల మరణానికి పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఆరోపించి ఈ నిర్ణయం తీసుకుంది.

ఉగ్రవాదానికి నీటి సహకారం ఇవ్వం..
సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్‌కు నీటి సరఫరా చేయలేనని భారత్‌ గట్టిగా చెప్పింది. ఒప్పందం తాత్కాలికంగా పక్కనపెట్టినందున అంతర్జాతీయ వేదికలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పాక్‌ వ్యవసాయం సింధు నదులపై ఆధారపడుతుండటంతో తర్బేలా, మంగ్లా జలాశయాల్లో నీరు ప్రమాద స్థాయిలో ఉంది.

అంతర్జాతీయ ఒత్తిడికి పాకిస్తాన్‌ వ్యూహం..
భారత్‌ పాల్గొనకపోయినా, కోర్టు పాక్‌ విన్నపాన్ని ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. సమాచారం ఇవ్వకపోతే ప్రతికూల ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. భారత్‌ ఇది ఏకపక్షీయమని, యథార్థాలను విస్మరించినదని వాదిస్తోంది.

ఈ ప్రతిష్టంభన సింధు వివాదాన్ని నీటి పంపకాలకు మించి భారత–పాక్‌ దౌత్య యుద్ధంగా మార్చింది. భారత్‌ గట్టి నిలబడటం పాక్‌ ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. భారతం లేని విచారణలు చట్టపరంగా బలహీనమే అవుతాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version