Star Directors Favorite Heroes: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళు చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నారు. నిజానికి ఆయా దర్శకులు వాళ్ళ అభిమాన హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక వాళ్ల ఎంటైర్ కెరియర్ లో చాలా అభిమాన హీరోతో ఒక్క సినిమా అయిన చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి సందర్భంలోనే కొంతమందికి ఆ అవకాశం వస్తే మరి కొంతమందికి మాత్రం అభిమాన హీరోతో చేసే అవకాశాలు రావడం లేదు…
సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లందరు ఇండస్ట్రీకి రాకముందు విపరీతమైన సినిమాలను చూస్తూ పెరిగిన వారే కావడం విశేషం… అందువల్లే మన స్టార్ హీరోల్లో ఎవరో ఒకరు వాళ్లకు ఫేవరెట్ హీరోలుగా ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న స్టార్ హీరోలకు మంచి సక్సెస్ లను అందించడంలో మన దర్శకులు సైతం తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటికే రాజమౌళి (Rajamouli) లాంటి స్టార్ డైరెక్టర్ బాహుబలి (Bahubali) సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ సినిమాతో మరిన్ని రికార్డులను కూడా క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. రాజమౌళి సినిమా ఇండస్ట్రీకి రాకముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని తనే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు…
ప్రస్తుతం ప్రభాస్ (Prabhas)తో ఫౌజీ (Fouji) సినిమా చేస్తున్న హను రాఘవపూడి జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని అంటు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికే తను ఇండస్ట్రీకి వచ్చానని ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పడం విశేషం…
గబ్బర్ సింగ్ (Gabbar sing) సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హరీష్ శంకర్(Harish Shankar) సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాne కావడం విశేషం… అందుకే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాను చేసి ఆయనకు సక్సెస్ రూపం లో ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాడు…
వాల్తేరు వీరయ్య (Valtheru Verayya) సినిమాతో చిరంజీవికి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందించిన బాబీ సైతం చిరంజీవికి వీరాభిమాని అనే విషయం మనలో చాలామందికి తెలియదు…
పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం కెరియర్ స్టార్టింగ్ లో చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కి ఇద్దరికీ వీరాభిమానిగా ఉండేవాడని తను ఒక సందర్భంలో తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ తో తన మొదటి సినిమా చేయడం నిజంగా తన అదృష్టం అంటూ ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు…
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్న సుజీత్ (Sujeeth) సైతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావడం విశేషం…అందుకే ఆయన కూడా పవన్ కళ్యాణ్ కి ఒక భారీ సక్సెస్ ను అందించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…