Adhurs: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సబ్జెక్టులను చేసుకుంటూ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆయన చేసిన ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఎన్టీయార్ పేరు దేశం నలుమూలాల తెలిసేలా చేసింది. ఇక ఇప్పుడు దానికి కొనసాగింపుగానే దేవర సినిమాతో మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నాడు.
ఈ సినిమా ఊపు చూస్తుంటే ఇండస్ట్రీలో పెను సంచలనాలను సృష్టించే విధంగా అద్భుతమైన మేకింగ్ తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ వరుసగా ఏడవ హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. టెంపర్ సినిమా నుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు వరుసగా ఆరు హిట్లను సాధించిన ఏకైక స్టార్ హీరోగా కూడా తను ఒక మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాతో ఏడో హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే 2010 సంవత్సరంలో వివి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన అదుర్స్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది.
అలాగే ఎన్టీఆర్ కెరియర్ లో అప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ సాధించిన సినిమాగా కూడా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఎన్టీయార్ డ్యూయల్ రోల్ పోషించిన విషయం మనకు తెలిసిందే. బేసిగ్గా డ్యూయల్ రోల్ చేసినప్పుడు అతనికి డూపుగా మరొక ఆర్టిస్ట్ నటిస్తాడు. అయితే ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ డూప్ నటించినప్పటికీ కొన్ని సీన్లల్లో మాత్రం ఆయన అందుబాటులో లేకపోవడంతో ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మ్యాన్ అయిన ‘కిరణ్ ‘అనే వ్యక్తిని పెట్టి షూట్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఆయన కూడా అచ్చం ఎన్టీఆర్ లాగే ఉంటాడు కాబట్టి అతన్ని ఎన్టీఆర్ కి డూప్ గా వాడరట. ఇక వివి వినాయక్ కిరణ్ తోనే చాలా సీన్లను షూట్ చేసి సినిమాను రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఎన్టీఆర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది…