Kalki 2898 AD: ‘కల్కి’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కి డూప్ గా నటించింది ఇతనా..? ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!

నిజానికి కల్కి చిత్రంలో రిస్కీ గా అనిపించే స్తంట్స్ అమితాబ్ బచ్చన్ చేయలేదు. ఆయనకి బదులుగా సునీల్ కుమార్ అనే నటుడు డూప్ గా చేసాడు. ఇతను రీసెంట్ గా విడుదలైన కామెడీ హారర్ చిత్రం 'స్త్రీ2' లో విలన్ గా నటించి ప్రేక్షకులను భయపెట్టాడు.

Written By: Vicky, Updated On : August 29, 2024 4:59 pm

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి ఎంత మంచి పేరు వచ్చిందో, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి కూడా అంతే మంచి పేరొచ్చింది. ఈ వయసులో ఆయన యాక్షన్ సన్నివేశాల్లో కుర్ర హీరో ప్రభాస్ తో పోటీ పడడం అంటే మాటలా?, ఇప్పుడే ఇలా ఉన్నాడంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఇక ఏ రేంజ్ లో ఉండేవాడో. అప్పట్లో అమితాబ్ బచ్చన్ అంటే జనాలు ఎందుకు అలా పడి చచ్చిపోయేవారో ఇప్పుడు అర్థం అవుతుంది అంటూ నేటి తరం ఆడియన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఈ సినిమాని చూసినప్పుడు ట్వీట్లు వేశారు.

అయితే నిజానికి కల్కి చిత్రంలో రిస్కీ గా అనిపించే స్తంట్స్ అమితాబ్ బచ్చన్ చేయలేదు. ఆయనకి బదులుగా సునీల్ కుమార్ అనే నటుడు డూప్ గా చేసాడు. ఇతను రీసెంట్ గా విడుదలైన కామెడీ హారర్ చిత్రం ‘స్త్రీ2’ లో విలన్ గా నటించి ప్రేక్షకులను భయపెట్టాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో మన అందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించబోతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సునీల్ కుమార్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

ఆయన మాట్లాడుతూ ‘కల్కి’ చిత్రంలో నేను అమితాబ్ బచ్చన్ గారికి డూప్ గా నటించాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మా కుటుంబం మొత్తం అమితాబ్ బచ్చన్ గారికి వీరాభిమానులు. అలాంటి సూపర్ స్టార్ ని కలలో కూడా నేను కలుస్తానని అనుకోలేదు. ఇప్పుడు కలవడమే కాకుండా, ఆయనకి డూప్ గా నటించే అద్భుతమైన అవకాశం కలగడం నా అదృష్టం గా భావిస్తున్నాను. నా మీద ఎన్నో పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు. సెట్స్ లోకి నేను అడుగుపెట్టగానే ప్రభాస్ – అమితాబ్ బచ్చన్ గారు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను 7.7 అడుగుల ఎత్తు ఉంటాను. అమితాబ్ గారు నన్ను చూసి నా పక్కనే నిల్చొని ఫోటో తీయించుకున్నారు. నాకంటే పొడవు ఉన్న వ్యక్తి దొరకరేమో అనుకున్నాను, మొత్తానికి దొరికావు అంటూ అమితాబ్ గారు నన్ను ప్రశంసించారు’ అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ కుమార్. జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సునీల్ కుమార్, అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ప్రారంభంలో కాస్త ఇబ్బందులను ఎదురుకున్నా, ఇప్పుడు ఒక మంచి ఆర్టిస్టుగా బాలీవుడ్ లో స్థిరపడిపోయారు. ‘స్త్రీ2’ పెద్ద హిట్ అవ్వడంతో సునీల్ కుమార్ కి ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాల వెల్లువ కురుస్తుంది.