Rajinikanth Favorite Movies: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ ఈ జనరేషన్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజు ముందు వరసలో ఉన్నాడనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో మంచి ఆదరణను సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని కూడా సంపాదించి పెట్టాయి…మరి లోకేష్ కనకరాజ్ ఇప్పటి వరకు చేసినవి తక్కువ సినిమాలే అయిన కూడా అతను చేసిన సినిమాలన్నింటిలో హీరోలను చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక రజినీకాంత్ లోకేష్ రాజ్ తో సినిమా చేయడానికి గల కారణం ఏంటి అంటే లోకేష్ కనకరాజ్ చేసిన ఖైదీ సినిమా రజనీకాంత్ కు బాగా నచ్చిందట. ఆ సినిమా మొత్తం ఒక నైట్ లోనే జరిగిన స్టోరీ కావడం దానిని దర్శకుడు చాలా సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేసిన విధానం చూసిన రజినీకాంత్ ఫిదా అయిపోయాడట. అందువల్లే లోకేష్ కనకరాజు తో కూలీ సినిమా చేశానని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక రజనీకాంత్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో మరి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటి అంటే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాత్రనైతే ఉండే విధంగా చూసుకుంటున్నాడు. అలాగే లోకేష్ తో చేసిన కూలి సినిమాలో కూడా రజనీకాంత్ క్యారెక్టర్ బాగుంది.
అలాగే తనని డిఫరెంట్ యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేశాడు. అందువల్లే రజనీకాంత్ క్యారెక్టర్ చాలా బాగా ఎలివేట్ అయింది. ఇక ఇప్పుడు నెల్సన్ డైరెక్షన్ లో చేస్తున్న ‘జైలర్ 2’ సినిమా విషయంలో కూడా రజనీకాంత్ ఆచితూచి మరియు ముందుకు అడుగులు వేస్తున్నాడు.
Also Read: ఎన్టీఆర్ ఇక జన్మ లో మల్టీ స్టారర్ మూవీ చేయడా..? కారణం ఏంటంటే..?
మరి లోకేష్ కనకరాజ్ తో మరో సినిమా చేయాలని కూడా రజనీకాంత్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒక లోకేష్ మాత్రం ఇప్పుడు ఖైదీ సినిమాకి సీక్వెల్ ను తెరకెక్కించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.
ఇక ఈ సినిమా ముగిసిన వెంటనే కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాకి సీక్వెల్ ను సైతం రంగంలోకి దించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ చాలా బిజీగా ఉండటం వల్ల ఆయన ఇప్పుడప్పుడే మరోసారి రజనీకాంత్ తో సినిమా చేసే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తున్నాయి…