Theater- OTT Movies: తెలుగు సినీ ఇండస్ట్రీకి శుక్రవారం ప్రత్యేకం. ఈ వారం రాగానే ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుందని ప్రేక్షకులూ ఎదురుచూస్తుంటారు. వీకెండ్ కావడంతో ఈ రోజు రిలాక్స్ కోసం థియేటర్లోకి వెళ్లేవారు ఎందురో ఉన్నారు. కొన్ని శుక్రవారాలుగా చాలా తక్కవ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఈ వారం తెలుగుతో పాటు తమిళ డబ్, హిందీ చిత్రాలు భారీగా రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల వివరాలేంటో చూద్దాం.

ఇట్లు..మారేడుమిల్లి ప్రజానీకం..
కామెడీ చిత్రాల నుంచి యాక్షన్ కు టర్న్ అయిన నరేశ్ విభిన్న చిత్రాలు చేస్తున్నాడు. గతంలో నటించిన ‘నాంది’తో నరేశ్ మాస్ హీరో అనిపించుకున్నాడు. ఆ తరువాత మళ్లీ కామెడీ జోలికి పోకుండా యాక్షన్ పైనే దృష్టి పెట్టాడు. ఈ తరుణంలో ఆయన నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా ఈనెల 25న థియేటర్లోకి రానుంది. ఇందులో నరేశ్ అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తిగా కనిపించి ఆకట్టుకోనున్నాడు. ఈ చిత్రాన్ని ఏఆర్ మోహన్ తీశాడు. రాజేశ్ దండా నిర్మాత.
తోడేలు:
మనిషి తోడేలుగా మారితే ఎలా ఉంటాడ..? ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది..? అసలు అతను ఎందుకు అలా మారాల్సి వచ్చింది..? అనే కాన్సెప్టుతో వస్తున్న హిందీ చిత్రి ‘భేదియా’. దీనిని తెలుగులో ‘తోడేలు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో వరుణ్ ధావణ్ హీరోగా నటించారు. కృతి సనన్ హీరోయిన్. తెలుగులో అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ఈ సినిమా ఈనెల 25న వెండితెరపై సందడి చేయనుంది.
లవ్ టుడే:
కొన్ని తమిళ సినిమాలో తెలుగులోనూ బ్లాక్ బస్టర్ కొడుతూ ఉంటాయి. అలా తమిళంలో మంచి టాక్ తెచ్చుుకున్న ‘లవ్ టడే’ను అదే పేరుతో తెలుగులో ఈనెల 25న తీసుకొస్తున్నారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వం వహించాడు. దీనిని తెలుగులో నిర్మాత దిల్ రాజ్ రిలీజ్ చేయనున్నారు.
రణస్థలి:
ధర్మ, చాందినిరావు జంటగా నటించిన ‘రణస్థలి’ అనే మాస్ మూవీ ఈనెల 26న తెలుగు తెరపై సందడి చేయనుంది. పరుశురాం శ్రీనివాస్ డైరెక్షన్లో అనుపమ సూరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేవిధంగా ఈ సినిమా ఉంటుందని చిత్రం యూనిట్ అంటోంది.

ఇలా థియేర్లోనే కాకుండా ఓటీటీలోనూ కొన్నిసినిమాలు ఈ వారం రిలీజ్ అవుతున్నాయి. వాటి వివరాలను చూద్దాం..
వెబ్ సిరీస్:
వెన్స్ డే -నవంబర్ 23
ద స్విమ్మర్స్ -నవంబర్ 23
గ్లాస్ ఆనియన్ -నవంబర్ 23
బ్లడ్ సెక్స్ అండ్ రాయల్టీ -నవంబర్ 23
ద నోయల్ డైరీ -నవంబర్ 25
ఖాకీ (ది బిహార్ చాప్టర్): -నవంబర్ 25
పడవేట్టు -నవంబర్ 25
సినిమాలు:
గుడ్ నైట్ ఊపీ (అమెజాన్) -నవంబర్ 23
చుప్ (జీ5) -నవంబర్ 25
ప్రిన్స్ (డిస్నీ+ హాట్ స్టార్) -నవంబర్ 25
ద గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ
హాలీడే స్పెషల్ -నవంబర్ 25
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (ఆహా) -నవంబర్ 25
ఎన్ బీకే అన్ స్టాపబుల్ 2 (ఎపిసోడ్4) -నవంబర్ 25
గర్ల్స్ హాస్టర్ (సోనీ లివ్) -నవంబర్ 25
మీట్ క్యూట్ -నవంబర్ 25