Hanuman Teaser: ఆధ్యాత్మిక సినిమాలకు ఈమధ్య డిమాండ్ బాగా ఉన్నట్టుంది. ముఖ్యంగా రామాయణం నేపథ్యంలో అనేక సినిమాలు వస్తున్నాయి. రామాయణంలో రాముడితో పాటు హనుమంతుడు కూడా ప్రత్యేకమే. రాముడికి నిజమైన భక్తుడిగా హనుమంతుడికి మంచి పేరుంది. హనుమంతుడు ప్రధానంగా అనేక సినిమాలు వచ్చాయి. అంజనీ పుత్రుడిపై మరో భారీ విజువల్ వండర్ ఎఫెక్ట్ తో ‘హను-మాన్’ రాబోతుంది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ మూవీ టీజర్ సోమవారం రిలీజైంది. టీజర్ బాగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు దీనిపై హోప్స్ పెట్టుకుంటున్నారు.

ఓ విలువైన మణి కోసం సాగే పోరాటంలో ‘హను-మాన్’ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియో సౌండ్ ఎఫెక్ట్ అద్భుతంగా ఉంది. ఓ కొత్త లోకంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేలా వీడియో అదిరిపోయింది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం. మిగతా వాటి కంటే విజువల్స్ ప్రధానంగా కనిపిస్తాయి.
చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలను చేసిన తేజ సజ్జా హీరోగా మంచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల్లో రెండు సక్సెస్ సాధించినవే. లేటేస్టుగా ఆయన ‘హను-మాన్’లో మరోసారి హీరోగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కంటే ఇందులో తేజ భారీ యాక్షన్ చేసినట్లు తెలుస్తోంది. ఆయనకుజోడిగా అమృతా అయ్యర్ నటిస్తోంది.

ఇక ఇందులో వరలక్ష్మీ ప్రధాన పాత్ర పోషించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. కొబ్బరికాయల గుత్తితో ఆమె ఫైట్ చేయడం చూస్తే నెగెటివ్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. విభిన్నమైన కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేశారు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో ఇదివరకు ‘జాంబిరెడ్డి’ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను మంచి అనభూతిని అందించింది. ఇప్పుడు ‘హను-మాన్’ కూడా ఆకట్టుకుంటుందని అంటున్నారు.