https://oktelugu.com/

Scam 1992 Web Series: హైయెస్ట్ వ్యూయర్ షిప్ ను సంపాదించుకున్న టాప్ వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

ఓటిటి ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుడికి చాలా రకాల ఎంటర్టైన్ మెంట్ అయితే అందుతుంది. ఇంతకుముందు సినిమాల ద్వారానే కాలక్షేపం చేసిన జనాలు ఇప్పుడు వెబ్ సిరీస్ ల ద్వారా కూడా చాలా వరకు ఎంటర్ టైన్ అవుతున్నారు...

Written By:
  • S Reddy
  • , Updated On : September 26, 2024 1:04 pm
    Scam 1992 Web Series

    Scam 1992 Web Series

    Follow us on

    Scam 1992 Web Series: బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోలు ఏ మాత్రం వాళ్ళ స్టామినాను అప్పుడు చూపించలేకపోతున్నారు. ఇక ఎప్పుడైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి ఇప్పటివరకు బాలీవుడ్ వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. అక్కడున్న స్టార్ హీరోలందరూ ఒకప్పుడు భారీ సక్సెస్ లను అందుకున్న వారే కావడం విశేషం. కానీ వాళ్లు మాత్రం ఇప్పుడు ఏ విధంగా వాళ్ళ సినిమాలతో మ్యాజిక్ చేయలేకపోతున్నారు. ఖాన్ త్రయం కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నారు. మరి బాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తిరిగి రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు పట్టే అవకాశాలైతే ఉన్నట్టుగా కనిపిస్తుంది…ఇక సినిమాల పరిస్థితి ఇలా ఉంటే సిరీస్ లు కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. ఇక అంతే తొందరగా ప్రేక్షకుల ఆదరణ పొందలేక డీలాపడిపోతున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే 2020 వ సంవత్సరంలో వచ్చిన ‘స్కాం 1992’ సిరీస్ భారీ గుర్తింపును సంపాదించుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన అర్షద్ మెహతా తన జీవితంలో ఎలా ఎదిగాడు అనే విషయాలను బేస్ చేసుకొని ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

    ఇక మొత్తానికైతే ఈ సిరీస్ కి చాలా మంచి గుర్తింపు రావడమే కాకుండా మంచి వ్యూయర్ షిప్ ను కూడా దక్కించుకుంది. ఇక సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఇప్పటికి చల్ మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల మంది జనం ఈ సిరీస్ ని చూసినట్టుగా తెలుస్తుంది.

    ఇక మీదట కూడా ఈ సిరీస్ చాలా మంచి గుర్తింపు ను సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి మొత్తానికైతే ఈ సిరీస్ ప్రేక్షకులందరిని చాలా బాగా ఎట్రాక్ట్ చేసింది. దానివల్ల ఈ సినిమా చూడడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. దర్శకుడు ఈ సిరీస్ ని తెరకెక్కించిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో హీరో చేసే బిజినెస్ గాని, ఆయన చెప్పే బిజినెస్ ఐడియాలు గాని ప్రేక్షకులందరిని అలరించాయి.

    ఇక దానికి తగ్గట్టుగానే దర్శకుడు కూడా ఒక మంచి స్క్రీన్ ప్లే రాసి ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్ళాడు. నిజానికి ఒక నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కే సినిమాలు గానీ, సీరీస్ లు గానీ జాగ్రత్తగా తెరకెక్కించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం మిస్టేక్ జరిగిన కూడా డైరెక్టర్ చాలావరకు విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది…