Heroes : సీనియర్ హీరోలు అందరూ మంచి సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. యంగ్ హీరోలు సినిమాలను చేస్తూ పాన్ ఇండియా రిలీజ్ చేస్తుంటే సీనియర్ హీరోలు మాత్రం సంవత్సరానికి ఒక సినిమా చొప్పున మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు… ఒకసారి ఒక సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆ సినిమా బాటలోనే మిగతా హీరోలు కూడా సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా దాదాపు 4 దశాబ్దాల నుంచి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు తెలుగు సినిమా ఆడియన్స్ మొత్తం సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసేవారు. అలాంటి గొప్ప కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న వీళ్ళు గత కొంతకాలం కిందట కొద్దివరకు వెనకబడిపోయారనే చెప్పాలి. ఇక ఇప్పుడు మరోసారి వాళ్ళ స్టామినాను చూపిస్తూ యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు… ఇక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో అడపాదడపా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే బాలయ్య బాబు మాత్రం వరుసగా నాలుగు సక్సెస్ లను సాధించి మంచి ఊపు మీద ఉన్నాడు. ఇక వెంకటేష్ మాత్రం ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankrathiki Vastunnaam) సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధించి 300 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాడు.
Also Read : రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి సినిమా చేసి ఉంటే బాగుండేదా..?
ఇక నాగార్జున సైతం కొంతవరకు వెనకబడ్డప్పటికి తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ నలుగురు హీరోల్లో ప్రస్తుతం బాలయ్య బాబు భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒక్క సినిమా కోసం దాదాపు 50 కోట్ల రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారట. మరి ఆయన ఇప్పుడు 40 కోట్ల రెమ్యూనరేషన్ అయితే కుంటున్నాడట.
ఇక మొత్తానికైతే ఇప్పుడు వస్తున్న వరుస సక్సెస్ ల వల్లే అతనికి ప్రొడ్యూసర్స్ ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు గా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది.
మరి ఆయన సాధించిన విజయాలు అతన్ని నెక్స్ట్ లెవెల్లో నిలుపుతున్నాయి. కాబట్టే అతనికి భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో బాలయ్య బాబు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనేది…