Balakrishna : నందమూరి నటసింహం గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు బాలకృష్ణ (Balakrishna)… ఒకప్పుడు బాలయ్య వరుస డిజాస్టర్లతో సతమతమయ్యాడు. కానీ ప్రస్తుతం మంచి సక్సెస్ లను సాధిస్తూ సక్సెస్ఫుల్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను సాధించి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ సీనియర్ హీరోకి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును కూడా తన పేరు మీద నమోదు చేసుకున్నాడు… ఇక అన్ స్టాపబుల్ షో నుంచి బాలయ్య బాబు వరుస సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. దీనికి గల కారణం ఏంటి అంటే బాలయ్య బాబు ఒకప్పుడు ఒక్క సక్సెస్ ని సాధించడానికి నాన్న తంటాలు పడుతూ ఉండేవాడు. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలను సాధించడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో కొంతమంది బాలయ్య బాబు అభిమానులు సైతం సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. నిజానికి బాలయ్య బాబు సినిమా స్క్రిప్ట్ కు సంబంధించిన సెలక్షన్ మొత్తాన్ని తన చిన్న కూతురు అయిన తేజస్విని (Tejashwini) చూసుకుంటుంది. ఆయన ఎలాంటి సినిమాలు చేయాలి ఎలాంటి సినిమాలు చేస్తే తనకు మంచి ఇమేజ్ వస్తుంది. అలాగే సినిమా సక్సెస్ గా మారుతుంది.
అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆమె బాలయ్య బాబుతో సినిమాలు చేసే దర్శకులతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య బాబు ఇమేజ్ ను రెట్టింపు చేయడానికి కొన్ని ఎలివేషన్ సీన్స్ కూడా ఉండేలా చూసుకుంటూనే అనవసరపు సీన్లను ఉండకుండా తను జాగ్రత్తలు తీసుకుంటుందట.
ఇక బాలయ్య ఏ సినిమా చేయాలి అనేది కూడా తేజస్విని గారే నిర్ణయిస్తారట. ఇక అఖండ, వీర సింహారెడ్డి, భగవంతు కేసరి, డాకు మహారాజ్ లాంటి నాలుగు సినిమాలను సెలెక్ట్ చేసింది తేజస్వినే కావడం విశేషం…ఈ సినిమాలతో బాలయ్య బాబు మంచి విజయాలను అందుకున్నాడు. అలాగే తేజస్విని కి కూడా చాలా మంచి గుర్తింపైతే వచ్చింది…
ఇక మొత్తానికైతే బాలయ్య బాబు మంచి సినిమాలు తీయడానికి కారణం తన కూతురు తేజస్విని అనే విషయాన్ని పలు సందర్భాల్లో తెలియజేశాడు. మరి ఏది ఏమైనా కూడా బాలయ్య కి కథ చెప్పాలి అంటే ముందు తేజస్విని
కి కథ చెప్పాలి. అది ఆమెకి నచ్చితేనే అప్పుడు ఆమె బాలయ్య బాబుతో సినిమా చేయడానికి అవకాశాన్ని కల్పిస్తోంది…