Prashant Neel and NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే ఏర్పాటు చేసుకున్నారు. ఇక అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి తారక రామారావు గారు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరు నందమూరి ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తూ మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. మరి వీళ్ళు ఎలాంటి సినిమా చేసిన కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్న క్రమంలో ఎలాగైనా సరే ఇప్పుడు మిగితా హీరోల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని నిలబడాలని చూస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించినప్పటికి కలెక్షన్స్ ల విషయంలో మాత్రం చాలా వరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి. దాంతో ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో ‘వార్ 2’ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు సాగుతున్నాడట. ఇక ఈనెల జరగబోయే షూటింగ్ తో ఆయన పార్ట్ మొత్తం ముగిసిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఆయన ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్ ‘ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఇక వచ్చే నెల నుంచి కర్ణాటకలో ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ని చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రశాంత్ నీల్ ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన ఈ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నాడు. తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనేది తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 9 న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది…