Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న అభిమానుల సంఖ్య కొన్ని కోట్లల్లో ఉంటుందనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. మరి ఇప్పుడు పొలిటిషన్ గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన తొందర్లోనే ఆయన పనిని పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ 2014వ సంవత్సరంలో జనసేన పార్టీ పెట్టినప్పుడు చాలామంది అతన్ని విమర్శించారు. ముఖ్యంగా తనకు కావాల్సిన సన్నిహితులే తనను ఛీకొట్టారంటూ ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ చెబుతూ ఉండటం విశేషం… ఇక ఇండస్ట్రీలో ఉన్న ఒక బడా నిర్మాత పవన్ కళ్యాణ్ కి బాగా సన్నిహితుడైన వ్యక్తి సైతం నువ్వేమన్న ఎన్టీఆర్ అనుకుంటున్నావా ఇప్పుడున్న పొజిషన్ లో హీరోలు సీఎంలు అవ్వడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
నీ వల్ల కాదు బుద్ధిగా సినిమాలు చేసుకో అంటూ కొన్ని కామెంట్లైతే చేశారట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ల కామెంట్లను ఏమి పట్టించుకోకుండా జనసేన పార్టీ పెట్టి గెలిచి చూపించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. కానీ మొదట్లో ఆయనకు ఎదురు దెబ్బలు తగిలినప్పటికి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మాత్రం గేమ్ చేంజర్ గా మారడమే కాకుండా ఒకే దెబ్బకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను కూడా దక్కించుకున్నాడు.
అలాంటి ఒక స్టార్ డమ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. నిజానికి పవన్ కళ్యాణ్ సిచువేషన్ లో ఎవరు ఉన్నా కూడా రాజకీయాల మనకు వద్దు మళ్లీ సినిమాలు చేసుకుందాం అంటూ వెనక్కి వెళ్లిపోయేవారు. కానీ ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా ఉండి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ మొత్తానికైతే డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ఉండడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాలనే లక్ష్యం పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తన సంకల్పాన్ని నిజం చేసుకున్నాడు… ఇక తనను వద్దు నీ వల్ల కాదు అంటూ చీ కొట్టిన వాళ్లే ఇప్పుడు అతన్ని కలవడానికి ఆసక్తి చూపిస్తూ అతనితో తమకు కావాల్సిన పనులను చేయించుకుంటున్నారు…