spot_img
Homeఎంటర్టైన్మెంట్Swathi Muthyam Child Artist: ‘స్వాతిముత్యం’ రాధిక కొడుకు ఆ హీరో మనువడా? ఇప్పుడు...

Swathi Muthyam Child Artist: ‘స్వాతిముత్యం’ రాధిక కొడుకు ఆ హీరో మనువడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?

Swathi Muthyam Child Artist: సమాజంలో జరిగే పరిస్థితులు సినిమాల ద్వారా కొందరు డైరెక్టర్లు కళ్లకు కట్టినట్లు చూపించారు. లెజెండ్ డైరెక్టర్ డాక్టర్ విశ్వనాథ్ అలనాడు అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రజలకు అందించాడు. ఆయన సినిమాల ద్వారా సమాజం ఎలా ఉందో తెలుసుకున్నారు. ఆయన మదిలో నుంచి వచ్చిన కావ్యం ‘స్వాతి ముత్యం’. ఈ మూవీ విశ్వనాథ్ సినీ కెర్ లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుంది. అప్పటికీ, ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఉన్న స్వాతి ముత్యం సినిమా ఇప్పుడు టీవీల్లో వస్తే కొందరు పూర్తి కాకుండా ఛానెల్ మార్చరు. స్వాతి ముత్యం సినిమాలో కమలాసన్, రాధిక, నిర్మలతో పాటు తదితరులు నటించారు. అమాయకపు పాత్రలో కమలహాసన్ నటన అదుర్స్ అని ఇప్పటికీ కొనియాడుతుంటారు. కమలహాసన్ లా నటించాలని ఎంతో మంది ప్రయత్నించినా ఆయనకు ఉన్న గుర్తింపు మాత్రం చెరిగిపోవడం లేదు. అటు రాధిక సైతం భర్తను కోల్పోయిన పాత్రలో నటించి అలరించారు. సౌత్ ఇండస్ట్రీలోనే ఎవర్ గ్రీన్ గా నిలిచిన ఈ మూవీలో కొందరు చైల్డ్ ఆర్టిస్టులు కనిపిస్తారు. వీరిలో రాధికతో ఉండే పిల్లాడి గురించి అందరికీ తెలుసు. రాధిక కుమారుడిగా ఉంటూనే కమలహాసన్ కు స్నేహితుడిగా, ఆయనకు కొడుకుగా నటించాడు. ‘ధర్మం శరనం గచ్చామి’ అన్న పాత్రలో వీరిద్దరు మాత్రమే కనిపిస్తారు. అయితే ఇప్పుడు ఈ పిల్లాడి గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. స్వామి ముత్యం సినిమా సమయంలో చిన్న పిల్లాడిలా ఉన్న ఈ బాబు ఇప్పుడు ఎలా మారిపోయోడోననే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అంతేకాకుండా ఈయన ఓ లెజెండ్ యాక్టర్ మనువడు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆ బాబు ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నారు?

Swathi Muthyam Child Artist
Swathi Muthyam Child Artist

తెలుగు చిత్ర పరిశ్రమలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనాధి నుంచి వస్తోంది. అయితే ఇలా ఎంట్రీ ఇచ్చిన వారు కొందరు మాత్రమే సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అందులోనూ చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చి ఇప్పుడు హీరోలుగా సక్సెస్ అయిన వారు ఉన్నారు. అయితే స్వాతి ముత్యం సినిమాలు చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ బాలుడి పేరు కార్తీక్. స్వాతి ముత్యం సినిమాలో నటించిన తరువాత కార్తీక్ మరిన్ని సినిమాల్లో నటిస్తారని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ సినిమాల్లో నటించలేదు. చదువుపై దృష్టి పెట్టాడు. ఆ తరువాత బాగా చదువుకొని అమెరికాకు వెళ్లాడు. అక్కడే సెటిలై ప్రస్తుతం అక్కడే ఉంటున్నాడు. అయితే కార్తీక్ ఇండియాకు చెందిన రమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

స్వాతి ముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన కార్తీక్ ఎవరో కాదు. లెజెండ్ హీరో కాంతారావుకు స్వయాన మనువడు. మొదటి తరం సినీ చరిత్రలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పోటీ పడ్డ కాంతారావు ఆ తరువాత మలి వయసులోనూ కొన్ని సినిమాల్లో నటించారు. కానీ ఆయన పర్సనల్ విషయాలు మాత్రం ఎవరికీ చెప్పుకోలేదు. అయితే స్వాతిముత్యం సినిమాలో కాంతారావు మనువడిని చూసిన విశ్వనాథ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అయితే స్వాతిముత్యం సినిమా తరువాత కార్తీక్ సినిమాలపై ఇంట్రెస్ట్ పెట్టలేదు. ప్రస్తుతం కార్తీక్ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ నిర్వహించడం లేదని తెలుస్తోంది. చాలా మంది తమ చిన్న నాటి సినిమాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ ఉంటారు. కానీ కార్తిక్ కు సోషల్ల మీడియాలో ఉండడం ఇష్టం లేనట్లు తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper
Exit mobile version