Sitara First Remuneration: సితార ఫస్ట్ రెమ్యూనరేషన్ తో ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

ఒకప్పుడు స్టార్ హీరోలు తమ ఫ్యామిలీ మెంబర్స్ ను ఎక్కువగా పరిచయం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు కొందరు స్టార్లు తన ఇంట్లో విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఉంటుంది.

Written By: Chai Muchhata, Updated On : July 17, 2023 5:20 pm
Follow us on

Sitara First Remuneration: మహేష్ బాబు కూతురు సితార పేరు తెలియని సినీ ప్రేక్షకులు లేరు. నిత్యం సోషల్ మీడియాలో తన యాక్టివిటీస్ తో అదరగొడుతున్న ఈమె మహేష్ ‘సర్కారువారిపాట’ సినిమాలో ఓ సాంగ్ లో కనిపించింది. లేటేస్టుగా ఈమె ఓ జువెల్లరీ యాడ్ లో కనిపించింది. అయితే ఫస్ట్ యాడ్ లోనే తన ఫోజులతో ఆకట్టుకుందీ పాప. ఈ యాడ్ చేయగా ఆమెకు కంపెనీ వాళ్లు కోటి రూపాయలు ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది. కానీ అసలు విషయం సితార గానీ, మహేష్ దంపతులు గానీ వెల్లడించలేదు. అయితే సితార మాత్రం తనకు వచ్చిన పారితోషికాన్ని ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు.

ఒకప్పుడు స్టార్ హీరోలు తమ ఫ్యామిలీ మెంబర్స్ ను ఎక్కువగా పరిచయం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు కొందరు స్టార్లు తన ఇంట్లో విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఉంటుంది. ఎందుకంటే అయన సినిమాల్లోనే కాకుండా రియల్ గా కూడా పలు యాడ్స్ లో కనిపిస్తుంటాడు. ఈ నేపథ్యంలో మహేష్ కు సంబంధించిన విషయాలను ఆయన సతీమణి నమ్రతా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. మహేష్, నమ్రతలకు ఇద్దరు సంతారు. వీరిలో కుమారుడు గౌతమ్ కాగా.. కూతరు సితార. గౌతమ్ ఇప్పడికే నేనొక్కడినే సినిమాలో కనిపించాడు. కూతురు ‘సర్కారు వారి పాట’ సినిమా సందర్భంగా ఓ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే.

తాజాగా సితార పీఎంజె జువెల్లరీని ప్రమోట్ చేసే యాడ్ లో నటించారు. ఈ యాడ్ లో సితార ఆభరణాలతో ఎంతో అందంగా ఉన్నారు. ఈ యాడ్ న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ లో కూడా ప్రదర్శితమైంది. ఫస్ట్ యాడ్ తోనే ఇంతటి పాపులారిటీ సాధించిన సితార ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమెకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే జువెల్లరీ యాడ్ కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్ ను ఏం చేసిందంటే..

ఫస్ట్ రెమ్యూనరేషన్ మొత్తం ఓ చారిటీకి ఇచ్చేసినట్లు సితార చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ తన యాడ్ చూసి డాడీ మహేష్ బాబు ఎంతో మెచ్చుకున్నారని తెలిపింది. ఇదిలా ఉండగా హీరోయిన్ రేంజ్ కు రాకముందే సితార కోటి రూపాయలతో యాడ్ లో నటించగా.. ఆమె నటించే సినిమాలకు ఎంత తీసుకుంటారోనన్న చర్చ సాగుతోంది. ఏదీ ఏమైనా ఆమె ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇలా దానం చేయడంపై ఆమెను మెచ్చుకుంటున్నారు.